అల్లు అర్జున్ పంచభూతాల్లో ఒకరుగా...
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కాంబినేషన్‌లో క్రిష్ 'వేదం' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కధ ప్రకారం క్రిష్ ప్రధానంగా వచ్చే ఐదు పాత్రల్నీ పంచ భూతాలతో పోల్చి స్క్రిప్టు చేసారని తెలుస్తోంది. స్లమ్ కుర్రాడు కేబుల్ రాజుగా కనిపించే అల్లు అర్జున్ పాత్ర పంచభూతాల్లో ఒకటైన ఎర్త్ కి సింబల్ అనీ, రాక్ స్టార్ వివేక్ చక్రవర్తి గా కనిపించే మంచు మనోజ్ పాత్ర ఫైర్ కి సింబల్ అనీ, వేశ్య సరోజగా కనిపించే అనుష్క గాలికి సింబల్ అనీ తెలుస్తోంది. ఈ చిత్రంలో పాత్రల తీరుతెన్నులు సరికొత్త రీతిలో ఉంటూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని దర్శకుడు క్రిష్ చెప్పారు.
తొలి సారిగా తెలుగు తెరపై మల్లీ డైమన్షన్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని, సంగీత దర్శకుడిగా 200 చిత్రాలు పూర్తి చేసుకున్న కీరవాణి ఈ సినిమాలోని ఏడు పాటలను స్వరపరిచారని, త్వరలో పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రసాద్ దేవినేని, షోబు యార్లగడ్డ చెప్పారు. మే 20న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మనోజ్ వాజ్ పాయ్, శీయా గౌతమ్, దీక్ష, లేఖ వాషింగ్టన్, శరణ్య, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, రవిప్రకాశ్, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, సంగీతం: కీరవాణి, ఫొటోగ్రఫీ: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్ కె. యాక్షన్: రామ్ లక్ష్మణ్


Click it and Unblock the Notifications











