‘ఎవడు’లో అల్లు అర్జున్ పోలీస్ గెటపా? (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న 'ఎవడు' చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు? అనేది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ పోలీసాఫీసర్‌గా గెటప్‌లో ఉన్న ఒక ఫోటో నెట్లో దర్శనం ఇస్తుండటమే ఈ వార్తలకు కారణం. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. ఇటీవల అల్లు అర్జున్ 'ఎవడు' చిత్రంలో తన పాత్ర గురించి వివరిస్తూ 'కేవలం అతిథి పాత్ర మాత్రమే చేస్తున్నానని, నా పాత్ర నిడివి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుందని' స్పష్టం చేసారు.

అల్లు అర్జున్ 'ఎవడు' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్న విషయం నిజమైతే....బన్నీ తొలిసారిగా అలాంటి పాత్రలో నటించిన చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కనుంది. సినిమా హిట్టయితే....బన్నీతో పోలీస్ ఆఫీసర్ గెస్ట్ రోల్ చేయించడం ఓ సెంటిమెంటుగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... మంచికీ చెడుకీ, న్యాయానికీ అన్యాయానికీ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అధిపత్యం చేతులు మారినా... చివరికి విజయం మంచి వైపే ఉంటుంది. అయితే ధర్మం వైపు నిలబడి పోరాడేవాడు కావాలి. ఏ సమరమైనా ఒక్కడే మొదలుపెడతాడు. ఆ తరవాత సమూహం అతని వెంట నడుస్తుంది. మరి ఆ ఒక్కడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ విషయాలు తెలియాలంటే 'ఎవడు' చూడాల్సిందే అని అంటున్నారు. బన్నీ కనిపించేది తక్కువ సేపే అయినా ఆయన క్యారెక్టర్ సినిమాను మలుపు తిప్పుతుందట.

'ఎవడు' లో రామ్ చరణ్ సరసన శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్స్ . అల్లు అర్జున్‌, కాజల్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. దిల్‌ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో పీటర్‌హెయిన్స్‌ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. సహనిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌; సంగీతం: దేవిశ్రీప్రసాద్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X