‘రేసుగుర్రం’లో బన్నీ క్యారెక్టర్ అదా?
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడాలో జరుగుతోంది. అక్కడ అల్లు అర్జున్, ముఖేష్‌రుషిలపై దర్శకుడు కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారని చిత్ర వర్గాల సమాచారం. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నవంబర్ మొదటి వారంలో, ఆడియోను డిసెంబర్ మూడవ వారంలో విడుదల చేసి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్. కిక్ శ్యామ్, సలోని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ "బన్ని కెరీర్‌లో ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే ఉంటుంది. మా రేసుగుర్రం విశేషాలు ఇంకా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే'' అని అన్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నల్లమలపు శ్రీనివాస్(బుజ్జి). డాక్టర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు.
ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications












