Allu Arjun: పుష్ప 2కు 1000 కోట్ల కంటే ఎక్కువ డీల్.. RRR రికార్డు బద్దలు.. ఇండియాలోనే సంచలనం
టాలీవుడ్‌లోకి సినీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ మధ్య 'అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ స్టైలిష్ హీరో.. 'పుష్ప' అనే మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన ఈ చిత్రంతో తెలుగులోనే కాదు.. దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 'పుష్ప' మూవీ రెండో భాగానికి భారీ డీల్ జరుగుతున్నట్లు తెలిసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఇండియా మొత్తాన్ని ఊపేసింది
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన చిత్రమే 'పుష్ప'. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. మొత్తంగా పుష్ప మేనియాతో ఇండియా మొత్తం ఊగిపోయింది.

అన్ని కోట్ల లాభాలతో రికార్డులు
ఎర్ర చందనం స్మగ్లింగ్ మాస్ యాక్షన్‌తో రూపొందిన 'పుష్ప'కు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 146 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్లు పైగా వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 కోట్లకు పైగా లాభాలు కూడా సొంతం అయ్యాయి.

రూల్ చేయడానికి వస్తున్నాడు
సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందే 'పుష్ప' మూవీ రెండు భాగాలుగా రాబోతుందని చిత్ర యూనిట్ ముందే ప్రకటించింది. ఇందులో మొదటి దాన్ని 'పుష్ప.. ద రైజ్' టైటిల్‌తో విడుదల చేశారు. అలాగే, ఇప్పుడు రెండో భాగానికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్‌గా ఎలా మారాడు అన్న విషయాన్ని హైలైట్ చేసి చూపించబోతున్నట్లు ఇప్పటికే తెలిసింది.

షూట్ మొదలు.. నెక్ట్స్ యాక్షన్
అల్లు అర్జున్‌కు 'పుష్ప' మూవీతో క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అలాగే, త్వరలోనే రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

పుష్ప 2కు అప్పుడే భారీ ఆఫర్లు
'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క టీజర్ గానీ, పోస్టర్ గానీ, ట్రైలర్ గానీ, పాట గానీ ఏమీ విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ చిత్రంపై ఉన్న బజ్ కారణంగా దీని హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అప్పుడే ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ, చిత్ర యూనిట్ మాత్రం వేచి చూసే ధోరణిలోనే ఉండిపోయింది.

పుష్ప 2కు 1050 కోట్లు డీల్ అని
ఆరంభం నుంచే నెలకొన్న అంచనాల కారణంగా 'పుష్ప ది రూల్' మూవీకి డిస్ట్రిబ్యూటర్ల నుంచి పలు సంస్థల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కుల కోసం కొందరు సంప్రదించగా అల్లు అర్జున్ ఏకంగా రూ. 1050 కోట్లు అడిగాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఈ న్యూస్ సంచలనంగా మారింది.

RRR రికార్డు బద్దలైపోతుంది
'పుష్ప ది రూల్' మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, కేరళ, రెస్టాఫ్ ఇండియా, హిందీ, ఓవర్సీస్, రష్య, చైనా హక్కులకు కలిపి చిత్ర యూనిట్ రూ. 1050 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. ఇది ఓకే అయితే RRR మూవీ పేరిట ఉన్న రూ. 900 కోట్లు రికార్డు కనుమరుగైపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











