అల్లు అర్జున్ మూవీలో మరో టాలీవుడ్ స్టార్ హీరో.. అట్లీ ప్లాన్ గట్టిగానే వేశారే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)దూసుకెళ్తున్నాడు. గతంలో కమర్షియల్ ఫార్మూలాలకు పరిమితమైన అల్లు అర్జున్ .. ఇప్పుడు అలాంటి జోనర్ నుంచి బయటకొచ్చి, వైవిధ్యమైన కథలు, డిఫరెంట్ దర్శకులను ఎంచుకుంటూ నేషనల్ లెవల్‌లో తన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా పుష్ప 2 తో పాన్ ఇండియా హీరోగా మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా అనుకున్నారు. కానీ, సడెన్‌గా కోలీవుడ్ హిట్ మేకర్ అట్లీ (Atlee) ఎంట్రీతో ప్లాన్స్ మారిపోయాయి.

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ప్రాజెక్ట్ (AA22)పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీని గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ టచ్‌తో రూపొందిస్తున్నారన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. అయినప్పటికీ ఇప్పటివరకు మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Allu Arjun-Atlee AA22 Rana Daggubati Entry Buzz Deepika Padukone Leads Pan-World Sci-Fi Film

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ హాట్ బజ్ ఏంటంటే... పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. రీసెంట్‌గా అట్లీ, అల్లు అర్జున్‌తో రానా భేటీ అయ్యారని, కథపై డిస్కషన్స్ జరిగాయని టాక్. దీంతో రానా ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ... ఈ న్యూస్ నిజమైతే మూవీ రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయం.

రానాకు ఇప్పటికే బాహుబలి సిరీస్ ద్వారా వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వచ్చింది. ఆ తర్వాత అలాంటి గ్లోబల్ స్కేల్ ప్రాజెక్ట్ చేయలేదు. ఇప్పుడు AA22లో భాగమైతే.. మళ్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను టచ్ చేసే అవకాశం దక్కినట్టే. హీరో, విలన్, గ్రే షేడ్స్... పాత్ర ఏదైనా సరే ఛాలెంజింగ్ రోల్స్‌కు ఓకే చెప్పే రానా, ఈ మూవీలో సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్ చేస్తాడని సినీ వర్గాల టాక్.

హీరోయిన్ విషయంలో ఇప్పటికే దీపిక పదుకొణే (Deepika Padukone) పేరు అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా భాగం కాబోతున్నారని సమాచారం. మృణాల్ ఠాగుర్ (Mrunal Thakur) పేరు కూడా ప్రచారంలో ఉంది. మొదట మృణాల్ నటిస్తుందన్న రూమర్లు వచ్చినా ఆమె వాటిని ఖండించింది. అయినప్పటికీ సినిమాలో మల్టిపుల్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటాయని తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్షర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నారట. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ చేస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే రూ.2000 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉందని బాలీవుడ్ మీడియా కూడా అంచనా వేస్తోంది. ఒకవేళ అల్లు అర్జున్-అట్లీ కాంబోకు రానా దగ్గుబాటి జతకలిస్తే, ఇది కేవలం పాన్ ఇండియా కాదు... నిజమైన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: allu arjun rana daggubati atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X