అల్లు అర్జున్ AA22xA6 విలన్ ఎవరో తెలుసా? హాలీవుడ్ టాప్ హీరో ను దింపుతున్న అట్లీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా పుష్ప2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఏకంగా ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ కాసుల వర్షం కురిపించారు. దాంతో అల్లు అర్జున్ రాబోయే చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సెట్ అవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను అందిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రంలో విలన్ ఎవరు? హాలీవుడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కాబోతున్న హీరో ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ అట్లీ మూవీ..
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోవడం, పుష్ప, పుష్ప 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్ కు ఓవర్సీస్ లోనూ భారీగా క్రేజ్ పెరగడంతో తన నెక్ట్స్ చిత్రాలను మరింత గ్రాండ్ గా నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో కొలబారేట్ అయ్యి తన 22వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం.

హాలీవుడ్ హీరోతో అట్లీ చర్చలు..
ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం దర్శకుడు అట్లీ హాలీవుడ్ నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు హాలీవుడ్ హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తోంది.థోర్, ఎక్ట్సాషన్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న హాలీవుడ్ హీరో క్రిస్ హెమ్స్వర్త్, అలాగే హాలీవుడ్ టాప్ హీరో విల్ స్మిత్ లు ఈ చిత్రంలో నటించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ తో పాటు అట్లీ వారిద్దరితో చర్చలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.
విలన్ పాత్ర పోషించేదెవరు?
అల్లు అర్జున్ అట్లీ సినిమాను లార్జన్ దన్ లైఫ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంతకీ ఈ చిత్రంలో విలన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా తొలిసారిగా అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, దాంతో అల్లు అర్జునే హీరోగా, అల్లు అర్జునే విలన్ గా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు హాలీవుడ్ హీరోలతోనూ అల్లు అర్జున్ తలపడే సీన్లు ఉంటాయని ప్రాజెక్ట్ పై హైప్ పెంచేస్తున్నారు.
హాలీవుడ్ టాపీ టెక్నీషియన్లతో AA22xA6..
AA22xA6 చిత్రం కోసం హాలీవుడ్ టాప్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు పని చేస్తుండటం విశేషం. మార్వెల్స్, అవేంజర్స్, స్పైడర్ మాన్, అక్వామెన్, వండర్ విమెన్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన టాప్ టెక్నీషియన్లు అట్లీ డైరెక్షన్ కు మెరుగులు దిద్దనున్నారు. ఇప్పటికే దీపికా పదుకొణె మెయిన్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications











