Allu Arjun-Atlee Film: అల్లు అర్జున్‌‌కి జోడీగా మ‌రో స్టార్ హీరోయిన్‌.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..

Allu Arjun -Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చుట్టూ రోజురోజుకూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీపిక పడుకొణే వంటి టాప్ హీరోయిన్ పేరు అధికారికంగా బయటకు రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీపై గుసగుసలు ఊపందుకున్నాయి. ఇంతకీ ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరు? ఈ భారీ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపికైన ఆ హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్‌లో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే దిశగా దూసుకుపోతున్నారు. పుష్ప 2 ద్వారా భారీ గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తదుపరి ప్రాజెక్ట్‌లన్నింటినీ అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Allu Arjun-Atlee Movie Is Anushka Sharma the Surprise Bollywood Entry Casting Buzz Goes Viral

హీరోయిన్‌ల జాబితా... స్టార్ లైనప్?
ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొణే ఈ సినిమాలో నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దాని తర్వాత నుంచి మరికొంతమంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో పెద్ద పేరు చేరింది. అదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ. ఈమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, అనుష్క శర్మకు ఇది మొదటి తెలుగు సినిమా అవుతుంది.

అనుష్క శర్మ రీ-ఎంట్రీ
క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా మాత్రమే కాకుండా, ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన అనుష్క శర్మ, పెళ్లి తర్వాత సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ ఆమెకు పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అవుతుందని భావిస్తున్నారట.

సైలెంట్ షూటింగ్... కానీ భారీ హైప్!
ఈ సినిమా షూటింగ్ దాదాపు 70% పూర్తయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నప్పటికీ, మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్లు రావడం లేదు. ఈ 'సైలెంట్ స్ట్రాటజీ'నే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే.. ఈ భారీ కాస్టింగ్‌పై నెటిజన్లు, సినీ విశ్లేషకులు మిక్స్‌డ్ రియాక్షన్ ఇస్తున్నారు. ఒకవైపు పాన్ ఇండియా మార్కెట్ కోసం బాలీవుడ్ స్టార్‌లను తీసుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతుండగా, మరోవైపు ఇంతమంది హీరోయిన్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ సరైన ప్రాధాన్యం దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజుతో 'AA23' పేరుతో ఓ భారీ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ద కపూర్ పేరు వినిపించగా, తాజాగా ఇక్కడ కూడా అనుష్క శర్మ పేరు చర్చలోకి రావడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ గాసిప్స్ మాత్రమే. అనుష్క శర్మ నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం క్లియర్.. అల్లు అర్జున్-అట్లీ కాంబో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నిజంగా ఇంతమంది స్టార్ హీరోయిన్లు ఉంటే, ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మల్టీస్టార్ గ్లామర్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: anushka sharma allu arjun atlee
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X