అల్లు అర్జున్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదేనా?

Allu Arjun Atlee Film: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప-2తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ మూవీతో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ఈ భారీ విజయానంతరం ఆయన చేయబోయే సినిమా ఏదన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మొదటగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరోసారి జతకట్టనున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమయ్యే అవకాశముందని, దానికి బదులుగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో బన్నీ చేతులు కలిపారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అట్లీ సినిమాలంటే భారీ కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలివేషన్స్, ఎమోషనల్ డ్రామా అన్నీ కలగలిపిన ప్యాకేజ్. అలాంటి దర్శకుడికి అల్లు అర్జున్ వంటి ఎనర్జిటిక్ స్టార్ దొరకడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా హై యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ సెట్స్, పాన్ ఇండియా రేంజ్ ట్రీట్మెంట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని సమాచారం.

Allu Arjun Atlee Movie Janhvi Kapoor Joins Deepika Padukone in Bunny s Next Pan India Film

ఇక ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎంపిక కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ భామ, అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ హీరోయిన్ ను ప్రాజెక్ట్ లో తీసుకోవడం వల్ల బాలీవుడ్ మార్కెట్ మరింత కలిసివస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే.. జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో 'దేవర' సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా విజయం సాధించినప్పటికీ, ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చర్చలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్‌తో 'పెద్ది'లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌తో కూడా జతకడితే, టాలీవుడ్‌లో వరుసగా అగ్ర హీరోలతో నటించిన ఘనత ఆమెకు దక్కుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు దీపికా, జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశముండటంతో సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ మరింత పెరగనుంది. గ్లామర్, మాస్, యాక్షన్ అన్ని ప్యాకేజ్‌గా ఈ సినిమా నిలిచేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అధికారికంగా హీరోయిన్ కాస్టింగ్‌పై ఇంకా ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్తలు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'పుష్ప' సిరీస్‌తో ఇప్పటికే నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్... ఈ అట్లీ ప్రాజెక్ట్‌తో గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారని టాక్. ఇలా అల్లు అర్జున్ - అట్లీ కాంబోకు దీపికా, జాన్వీ లాంటి బాలీవుడ్ స్టార్స్ జతకడితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X