AA22xA6 Movie: రిలీజ్‌కు ముందే రికార్డులు .. అల్లు అర్జున్ మూవీ ఓటీటీ డీల్ ఎన్ని కోట్లంటే?
AA22xA6 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీపై సినీ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేవలం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇలా అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు టైటిల్, ఫస్ట్ లుక్ వంటి అధికారిక అప్‌డేట్స్ రాకపోయినా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓటీటీ డీల్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ సంగతేంటీ..?
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు టాక్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఎక్కువ భాగం షెడ్యూల్స్ ముంబైలోనే జరుగుతున్నాయని సమాచారం. షెడ్యూల్స్‌కు అనుగుణంగా అల్లు అర్జున్ హైదరాబాద్, ముంబై మధ్య తిరుగుతూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సులు, కీలక డ్రామాటిక్ సన్నివేశాలను ముంబై సెట్స్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది డిజిటల్ డీల్. అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకునేందుకు రిలీజ్‌కు ఏడాది ముందే అడ్వాన్స్‌డ్ టాక్స్‌లో ఉందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. ఇది నిజమైతే, భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ డీల్‌గా రికార్డు సృష్టించనుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
క్రేజీ కాంబినేషన్ కావడంతో పాటు, పాన్ వరల్డ్ రేంజ్ కంటెంట్ కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పునర్జన్మలు, సైన్స్ బ్యాక్ డ్రాప్ అనే కాన్సెప్ట్‌తో ఈ కథ సాగుతుందని టాక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ భారీ యాక్షన్‌తో ఉండబోతోందని సమాచారం. ఆ సన్నివేశం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, డాన్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతుందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ఈ సినిమాలో మూడు తరాలు, నాలుగు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా ఆయన పాత్రలు ఉంటాయని టాక్. ఇలాంటి కాన్సెప్ట్ కోసం భారీ వీఎఫ్ఎక్స్ అవసరం కావడంతో, అట్లీ హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్‌పై చూడని కొత్త ప్రపంచాన్ని చూపించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు అట్లీ ఇటీవల ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
హీరోయిన్ల విషయంలో ఇప్పటివరకు అధికారికంగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె పేరును మాత్రమే కన్ఫర్మ్ చేశారు. ఇతర హీరోయిన్‌ల గురించి క్లారిటీ లేదు. అయితే మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అలాగే సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో సినిమాను తెరకెక్కించేందుకు సన్ పిక్చర్స్ భారీగా పెట్టుబడి పెడుతోంది. షూటింగ్‌ను 2026 రెండో భాగం నాటికి పూర్తి చేసి, 2027 సమ్మర్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











