AA22xA6 : షూటింగ్ స్టార్ట్.. సెట్స్ లోకి అల్లు అర్జున్.. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 తో భారీ సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1870 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. పుష్ప చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమాలకు క్రేజ్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా సినిమాల నుంచి ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాలపై బన్నీ ఫోకస్ పెట్టారు. తన లైనప్ లో నెక్ట్స్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకాచకా పూర్తయ్యాయి.ప్రస్తుతం షూటింగ్ ప్రారంభించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే న్యూస్ అందింది.
భారీ బడ్జెట్ తో AA22xA6 ప్రాజెక్ట్..
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, జవాన్ లాంటి 1100 కోట్ల సినిమాను బాలీవుడ్ గడ్డపై డైరెక్ట్ చేసిన అట్లీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ లో పెనుమార్పులు రావడంతో అత్యాధునిక టెక్నాలజీతోనే AA22xA6 ప్రాజెక్ట్ ను నిర్మించ తలపెట్టారు. కోలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనుంది. ఇందుకు రూ.800 కోట్ల బడ్జెట్ ను వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది.

రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం..
ఇప్పటికే AA22xA6 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను మేకర్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు చకాచకా కొనసాగుతున్నాయని తెలియజేసే వీడియోను పంచుకున్నారు. అలాగే AA22xA6 ప్రాజెక్ట్ కు మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొణెను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీపై మరింతగా హైప్ నెలకొంది.ఇక తాజాగా జూన్ 11న మూవీ షూటింగ్ కు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. రేపు జూన్ 12 నుంచి ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రడక్షన్ సీన్లను చిత్రీకరించబోతున్నారు.
అల్లు అర్జున్, అట్లీ, దీపికాల రెమ్యునరేషన్లు..
ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించేందుకు అల్లు అర్జున్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు అట్లీ కూడా రూ.100 కోట్లు ఛార్జ్ చేస్తున్నారంట. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కూడా రూ.30 కోట్ల వరకు చార్జీ చేసిందని తెలుస్తోంది. ఇలా ఈ చిత్రంలో భారీ తారగణం ఉండటం విశేషం.
హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా..
పుష్ప2తో గ్రాండ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ తన నెక్ట్స్ మూవీని అట్లీతో ప్రకటించారు. అయితే ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ కు తగ్గకుండా రూపొందించబోతున్నారు. అందుకోసం హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్ పర్ట్స్, సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రెయినర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. హాలీవుడ్ స్టూడియోలు లోలా వీఎఫ్ఎక్స్, ఐరన్‌హెడ్ స్టూడియో, ఫ్రాక్చర్డ్ ఎఫ్ ఎక్స్, స్పెక్ట్రల్ మోషన్, ఐఎం టెక్నోప్రాప్స్ మరియు లెగసీ ఎఫెక్ట్స్ వంటి కంపెనీలతో కలిసి పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











