AA22xA6 : 800 కోట్ల బడ్జెట్ లో 400 కోట్లు దానికే ఖర్చు.. అట్లీ ప్లానింగ్ చూశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే చిత్రం AA22xA6. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప 2 ది రూల్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ భారీ సక్సెస్ ను అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ.1870 కోట్ల వరకు వసూళ్లు సాధించడం విశేషం. దీంతో అల్లు అర్జున్ నుంచి రాబోయే చిత్రాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకు తగ్గట్టుగానే ఐకాన్ స్టార్ తన తదుపరి చిత్రాలను ఊహకందని స్థాయిలో నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో AA22xA6 చిత్రంపై మేకర్స్, అట్లీ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో AA22xA6..
ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకోని బడ్జెట్ తో AA22xA6 చిత్రం రూపుదిద్దుకుంటోంది. SSMB29 తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయించిన చిత్రం ఇదే. AA22xA6 ప్రాజెక్ట్ కోసం ఏకంగా నిర్మాతలు రూ.800 కోట్లు వెచ్చిస్తుండటం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కోలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతుండటం విశేషం. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

400 కోట్ల బడ్జెట్ తో అట్లీ మేజిక్..
అల్లు అర్జున్ - అట్లీ మూవీ ప్రాజెక్ట్ అనౌన్స్ కు ముందు ఈ సినిమాపై చాలా పుకార్లు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ మూవీ సెట్ కాలేదని రూమర్లు వచ్చాయి. కానీ ఆ కొద్దిరోజులకే ప్రీ ప్రొడక్షన్ పనులు చకా చకా నడుస్తున్నాయని, ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మించబోతున్నామని చెప్పేలా ఓ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఖుషి అయ్యారు.
అయితే AA22xA6 ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు పని చేయబోతుండటంతో రూ.800 కోట్ల వరకు ఖర్చవుతుంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ బడ్జెట్ లో రూ.400 కోట్ల వరకు కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేస్తున్నారంట. బడ్జెట్ ఖర్చు చేయడంలో అట్లీకి నిర్మాత చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అంటున్నారు. తను అనుకున్న అవుట్ పుట్ కోసం ఎంతైనా ఖర్చు చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించే సినిమాను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే స్పైడర్ మెన్, అవెంజర్స్, అక్వా మెన్, వండర్స్ విమెన్ కు విజువల్ ఎఫెక్ట్స్ ను అందించిన వీఎఫ్ఎక్స్ సంస్థలు AA22xA6కి పని చేస్తుండటం విశేషం.
ముంబైలో భారీ సెట్స్..
AA22xA6 చిత్ర షూటింగ్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారని తెలుస్తోంది. ముంబైలోనే 3 నెలల పాటు చిత్రీకరణ కొనసాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం భారీ సెట్ లో 3డీ స్కానింగ్ కు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇక ముంబై షూటింగ్ పూర్తైన తర్వాత త్వరలోనే యూఎస్ కు కూడా వెళ్లబోతున్నారని టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











