అల్లు అర్జున్ బద్రీనాథ్ ని బాలీవుడ్ నుండి కొట్టుకొచ్చారట...
కండలు తిరిగిన బాడీని కత్తులతో అలంకరించుకొని ముందుకొచ్చిన అల్లు అర్జున్ 'బద్రీనాథ్" పోస్టర్లు ఆకట్టుకునే విధంగా వున్నా, కొందరు మాత్రం ఇవి కాపీ కొట్టారని ఎద్దేవా చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా రెండేళ్ల క్రితం విడుదలైన 'వీర్" చిత్రంలోని స్టిల్స్ ని కాపీ కొట్టారని, ఇది వివి వినాయక్ సొంత తెలివి కాదని 'బద్రీనాథ్" పబ్లిసిటీని కొందరు అడ్డుకుంటున్నారు...
పొడగాటి జుట్టు, గ్లేడియేటర్ ని తలపించే దుస్తులు, మజిల్ బాడీ..ఇలా అన్నింటా అల్లు అర్జున్ బాగానే కష్టపడ్డా 'కాపీ"అన్న రిమార్కు రావడంతో 'బద్రీనాథ్" యూనిట్ కాస్త నీరసించారని సమాచారం. మరి ఇలాంటి ఆటుపోట్లు నిర్మాత అల్లు అరవింద్ కు కొత్తేమీ కాకపోయినా, కథనైనా కొత్తగా ఎంచుకుంటేనే 'బద్రీనాథ్" మీద పెట్టిన భారీ బడ్జెట్ కు ఓ అర్థం వుంటుంది. అన్నింటికీ సమాధానం మే నెల్లోనే దొరకనుంది.
allu arjun badrinath allu aravind vv vinayak salman khan veer అల్లు అర్జున్ బద్రీనాథ్ అల్లు అరవింద్ వివి వినాయక్ సల్మాన్ ఖాన్ వీర్


Click it and Unblock the Notifications