twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ‘బద్రీనాథ్’ అవుట్ డోర్ షూట్ కొల్లాప్స్...!?

    By Sindhu
    |

    మగధీర తర్వాత గీత ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'బద్రీనాథ్" నిర్మాత దిగ్గజం అల్లు అరవింద్ నేతత్వంతో బద్రీనాథ్ షూటింగ్ నిర్విరామంగా సాగిపోతుంది. గీతా ఆర్ట్స్ యూనిట్ అంతా అవుట్ డోర్ వెళ్లి హీరో అల్లు అర్జున్ తో శరవేగంతో షూటింగ్ ను కొనసాగించారు. వరుడు ప్లాప్ కావటం బన్నీకి ఎంతో నిరాశను మిగిల్చింది. వేదంలో బన్నీ వేషం ఉన్న సోలోగా లేకపోవటంతో బద్రీనాథ్ బన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా కోసం బన్నీ కూడా ఎంతో కష్టపడి అవుడోర్ లో రియాల్టిపిక్ గా కొన్ని ఫైట్స్ చేశారు. వివిధ లొకేషన్స్ లో కొన్ని పాటలు కూడా చిత్రీకరణ చేశారు.

    అవుట్ డోర్ లో ప్లాన్ చేయటం అంటే ఈ రోజుల్లో టోటల్ బడ్జేట్ లో అధిక శాతం అవుట్ డోర్ లోనే ఖర్చుపెడతారు. పైగా అల్లు అరవింద్. ఖర్చుకు రాజీలేకుండా తీయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి. ఇంత కష్టపడి అవుట్ డోర్ లో షూట్ చేసిన భాగమంతా పనికిరాకుండాపోయిందని తెలియటంతోనే బన్నీ యునిట్ సభ్యులమీద, కెమెరా మ్యాన్ మీద కోపంగా ఉన్నారని తెలిసింది. ఒక్కొక్కసారి 'కాన్" లోపం వల్ల షూట్ చేసిన పిలిం మొత్తం షాగ్ అవ్వటం అప్పుడప్పుడు జరుగుతుంది. ఎందుకంటే 'కాన్"లు సీల్డు చేసి ఉంటాయి. వాటిని కెమెరాలోకి లోడ్ చేసేటప్పుడు, అసలు సూర్యరశ్మి తగలకుండ లోడ్ చేసి షూటింగ్ చేస్తారు. కాన్ లో ఉన్న ఫిలింలోపం వల్లకాని, లోడ్ చేసేటప్పుడు పొరపాటు వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందుకే కాన్ ఫుల్ అవ్వగానే ఫిల్మింను డెవలప్ చేసి చూస్తారు.

    కారణం ఏదైతేనేం చేసిన షూటింగ్ అంతా మరలా రీ షూట్ చేయాల్సి వచ్చింది. అసలే బన్నీ కుర్రవాడు, మంచి హిట్ కొట్టాలనే తొందరలో ఉన్న యువస్టార్ మరి ఇలాంటివి జరిగినప్పుడు కోపంగానూ, బాధగాను ఉండటం చాలా సర్వసాధారణం కదా? మరలా యూనిట్ అంతా అవుట్ డోర్ కు వెళ్లి తీసిన షూటింగ్ మరలా తీయాలని గీతా ఆర్ట్స్ సిద్దంగా ఉందని తెలుస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X