Allu Arjun: అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న బన్నీ.. లిస్టులో అఖిల్ డైరెక్టర్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ తో చాలా బిజీగా ఉన్న విషయాన్ని తెలిసిందే. ఫస్ట్ పార్ట్ భారీ స్థాయిల విజయాన్ని అందుకోవడంతో రెండో భాగం కోసం బన్నీ ఇంకా ఎక్కువ స్థాయిలో కష్టపడుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ప్రమోషన్ వీడియో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. సుకుమార్ ఈ సినిమాను అంచనాలకు తగ్గట్టుగానే తెరపైకి తీసుకురాబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే తన భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా క్లారిటికి వస్తూ ఉండడం ఒక విశేషం అని చెప్పాలి. బన్నీ ఇప్పటికే తన లిస్టులో కొంతమంది దర్శకులను ఫైనల్ చేసుకున్నాడు. పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత బన్నీ కోసం తెలుగు దర్శకులు అయితే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగాతో ఒక ప్రాజెక్టు లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Allu arjun big planning for feature pan india projects

అలాగే ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులను కూడా బన్నీ ఫైనల్ చేసుకునే అవకాశం ఉందట. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అల..వైకుంఠపురములో సినిమాతో బన్నీ తన కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విజయాన్ని అందుకొని బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

అలాగే తనకు రేసుగుర్రం లాంటి సక్సెస్ ఇచ్చిన సురేందర్ రెడ్డి తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు ఇంకా ఓకే కాలేదు కానీ ప్రస్తుతం దర్శకుడు కథపై కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏజెంట్ సినిమాతో భారీ స్థాయిలో డిజాస్టర్ ఎదుర్కొన్న సురేందర్ రెడ్డి ఈసారి ఎలాగైనా మంచి కథను రెడీ చేసుకుని అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

Allu arjun big planning for feature pan india projects

అతనిపై నమ్మకంతో బన్నీ కూడా మంచి సినిమా చేయాలని ఆలోచనతో ఉన్నాడు. మరి సురేందర్ రెడ్డి ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. ఏదేమైనా కూడా బన్నీ మాత్రం త్వరలోనే మరొక రెండు ప్రాజెక్టులపై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X