Pushpa 2: ఆ నదిపై అల్లు అర్జున్ ఊచకోత.. ఇండియన్ సినిమాలో తొలిసారిగా!
ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, స్టైల్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ టాలీవుడ్‌లో బడా హీరోగా హవాను చూపిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుదీర్ఘ కాలం పాటు తెలుగు చిత్రాలతో తన రేంజ్‌ను పెంచుకున్న అతడు.. సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప: ద రైజ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసుకుంది.

ఫస్ట్ పార్ట్ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకోవడంతో 'పుష్ప ద రూల్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండో భాగానికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటోంది.
ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో యూనిట్ సభ్యులు చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
పుష్పరాజ్ ఎర్ర చందనం డాన్‌గా ఎలా మారాడు అన్న పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే హై రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను పెట్టబోతున్నారని తెలిసింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిపై జరిగే బోట్ చేజింగ్ సీన్‌ను డిజైన్ చేశారు.
ఇందులో నదిలోనే అల్లు అర్జున్ ప్రత్యర్థులను ఊచకోత కోస్తారని తెలిసింది. ఇందులో వచ్చే సన్నివేశాలు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా డిజైన్ చేసినట్లు తెలిసింది. ఇక, ఈ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే జరుగుతుందని తాజాగా తెలిసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











