సినిమావాళ్లతోనే అల్లు అర్జున్ బిజినెస్...అంతా షాక్
మహేష్ బాబు, నాగార్జున, జూ ఎన్టీఆర్ ఇలా ఎవరికి వారు తమ డబ్బుని ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టడంతో అల్లు అర్జున్ కూడా అటువైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.అయితే కొని అమ్మే స్కీమ్ కాకుండా సినిమా వాళ్లనే అడ్డం పెట్టుకుని ఆ ప్రాపర్టీపై లాభాలు సంపాదించాలని ప్లాన్ చేసారు. తాజాగా ఆయన హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ తల్లాపూర్ లో ఐదు కోట్లు తో ఒక ఎకరం తీసుకున్నారు. అక్కడ 5,000 స్వైర్ ఫీట్లతో ఓ విల్లాను నిర్మించారు.అలాగే అక్కడో రిసార్ట్ ని డవలప్ చెయ్యాలని చూస్తున్నారు.అందుకోసం చుట్టప్రక్కల ఎకరాలను కొనే ఆలోచనలో ఉన్నారు.అక్కడ స్పా,స్విమ్మింగ్ పూల్, అధ్బుతమమైన రెస్టారెంట్ కట్టిస్తున్నాడు. ఆ ప్లేస్ ని సినిమావాళ్లకు మాత్రమే రెంట్ కి ఇస్తాడని చెప్తున్నారు. రోజుకు లక్ష రూపాయలు అద్దెతో ఆ ప్లేస్ ని తీసుకోవాలిట. అక్కడ స్టోరీ డిస్కషన్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ వంటివి జరుపుతాడట. అంతేగాక ఆర్టిస్టులు వీకెండ్ పార్టీలకు,రిలాక్సేషన్ కి ఆ ప్లేస్ ను పూర్తి సెక్యూరిటిగా ఏర్పాటు చేస్తాడని అంటున్నారు.అతని మాస్టర్ మైండ్ కి బిజినెస్ మైండ్ కి, తమపైనే సంపాదించాలనే ఆలోచనకి సినిమావాళ్ళంతా షాక్ అవుతున్నారని తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం నవంబర్ రెండవ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ తో మొదలు కానుంది.ఇలియానా కూడా ఆ రోజునుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. శక్తి చిత్రం విడుదలైన దగ్గరనుంచి కనపడకుండా పోయిన ఇలియానా ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇవ్వనుంది.దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.గతంలో త్రివిక్రమ్ జల్సా చిత్రానికి సంగీతం అందించారు. అలాగే అల్లు అర్జున్ గత చిత్రాలకు దేవి సంగీతం బాగా ప్లస్ అయిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీనికోసం ఇటీవల ముంబయిలోని హకీమ్స్ అలీమ్ అనే సెలూన్‌లో కొత్త రకం హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు. ఈ లుక్ చాలా చాలా బాగుందని అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ అంటున్నారు. నాకైతే ఇప్పుడే అన్నయ్య ఫొటో విడుదల చేయాలని ఉంది. కానీ నా బ్రదర్ మాత్రం ఒకేసారి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామంటున్నాడు. పోస్టర్‌లో డెరైక్ట్‌గా చూస్తేనే ప్రభావం ఉంటుందని తన అభిప్రాయం అని అల్లు శిరీష్ ట్విట్టర్‌లో పెట్టారు. అలాగే రీసెంట్ గా ఊసరవెల్లి చిత్రంతో పలకరించిన స్టైలిష్ దర్శకుడు సురేంద్రరెడ్డి తన తదుపరి చిత్రాన్ని అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం చిత్రీకరణ మొదలు కానుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











