మనసు మార్చుకున్న అల్లు అర్జున్.. సుకుమార్‌తో చెప్పేశాడట!
అల్లు అర్జున్ గత సినిమా 'నా పేరు సూర్య' ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమా కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రంలో బన్నీ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ ఏడాది ఎలాగైనా భారీ హిట్ సాధించాలని భావిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సిందిగా బన్నీ కోరినట్లు తెలుస్తోంది.

గతంలో సుకుమార్.. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ కథను వినిపించగా దానికి ఓకే చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు మనసు మార్చుకొని లవ్ స్టోరీ కావాలంటున్నట్లుగా సమాచారం. దీంతో సుకుమార్, అంతకు ముందు రాసుకున్న పాత స్క్రిప్ట్ మార్చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఈ నెలాఖరులో మొదలుపెట్టి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ చేయాలని మొదట భావించినప్పటికీ.. ఇప్పుడది కుదిరేలా లేదట. ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన అతిత్వరలో రానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











