అల్లు అర్జున్ క్యారెక్టర్ చచ్చిపోతుందట..

By Srikanya

రామ్ చరణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర కొద్ది సేపే ఉంటుందని, అది కూడా చనిపోతుందని, అక్కడనుంచే కథలో మలుపు తిరుగుతుందని తెలుస్తోంది. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎవడు అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌ చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు.ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం పూజ కూడా జరిగింది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చ కు తుది మెరుగుల్లో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X