డైరక్టర్స్ కి అల్లు అర్జున్ కండీషన్స్?
హైదరాబాద్: జులాయితో మరోసారి భాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏమిటో నిరూపించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయన వరసగా సీనియర్ దర్శకుల చిత్రాలే కమిటవుతున్నారు. ప్లాప్, హిట్ లకు సంభందం లేకుండా ఆ సినిమాలే చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన వద్దకు ఆర్య.. సుకుమార్ తరహాలో కొత్త దర్శకులు ఎవరూ వెళ్లటం లేదా అనే సందేహం చాలా మందిలో వినిపిస్తోంది.
అయితే దీనికి సమాధానం ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అక్కడ వారు చెప్పేదేమిటంటే.. అల్లు అర్జున్ కథ, కథనం వగైరాల కన్నా ముందు వారి ట్రాక్ రికార్డుని పరిశీలిస్తున్నాడని అంటున్నారు. అంతకుముందు ఎవరి దగ్గర పనిచేసాడు... ఏమన్నా సినిమాలు డైరక్ట్ చేసాడా.. చేస్తే వాటి రిజల్ట్ ఏ రకంగా ఉంది.. టెక్నికల్ గా ఏ స్టాండర్ట్స్ లో ఉన్నాడు వంటివి అంచనా వేస్తున్నాడని చెప్తున్నారు. దాంతో కొత్త దర్శకులు ఎవరూ అల్లు అర్జున్ దగ్గరకి వెళ్లటం లేదని, ఒక సినిమా హిట్ కొట్టిన వారికి మాత్రమే ఆయనకు కథ వినిపించే అవకాసం దొరుకుతోందని అనుకుంటున్నారు.
అంతేగాక తనే ఫలానా దర్శకుడుతో పనిచేయాలనుకుని వారిని కలిసి, వారితో ప్రాజెక్టు మెటీరియలైజ్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ డేట్స్ ఉన్నప్పుడు నిర్మాతకు కొదవ ఉండదు. దాంతో అల్లు అర్జున్ పిలుపు కోసం దర్శకులు, పెద్ద చిన్న అనే తేడా లేకుండా చాలా మంది వెయిట్ చేస్తున్నారనేది నిజం.
ప్రస్తుతం అల్లు అర్జున్... పూరీ జగన్నాధ్ తో ఇద్దరమ్మాయిలతో చిత్రం చేస్తున్నాడు. రొమాటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. గణేష్ బాబు ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా నిర్మిస్తున్నాడు. పూరీ జగన్నాధ్.. ఖచ్చితంగా ఈ చిత్రం యూత్ ని విశేష స్ధాయిలో ఆకర్షిస్తుందని నమ్మకంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











