twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రీతిలో బన్నీ ఆఫీస్.. అల్లు అర్జున్ భారీ స్కెచ్.. హాట్ టాపిక్!

    |

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ యమ స్టైలిష్‌గా ఉంటారు. ఆయన, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ టాలీవుడ్ తారల్లోకెల్లా తాను భిన్నం అని నిరూపించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే తెలుగు యంగ్ స్టార్స్‌లో కాస్ట్లీ హీరోగా ఈయనపై ఓ ముద్ర పడింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీస్ విషయాలు తెలిసి అబ్బో! అంటూ ఆశ్చర్యపోతున్నారు జనం. మరి అంతగా ఆశ్చర్యపోయేలా బన్నీ ఏం చేస్తున్నాడు? వివరాల్లోకి పోతే..

    మొదటి నుంచే అలా.. క్యారవాన్, కార్ అన్నీ కూడా

    మొదటి నుంచే అలా.. క్యారవాన్, కార్ అన్నీ కూడా

    సాధారణంగానే బన్నీ ఎప్పుడూ వెరైటీ కోరుకుంటారనేది టాలీవుడ్ టాక్. బడా నిర్మాత కొడుకు కావడం, పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతుండటం కారణంగా ఆయన మరింత వెరైటీగా, అందరికంటే ఎక్కువ కాస్ట్లీగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన కొనుగోలు చేసిన క్యారవాన్, కార్ ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

    ఆస్తి పంపకాలు జరిగాక బన్నీ స్టెప్

    ఆస్తి పంపకాలు జరిగాక బన్నీ స్టెప్

    ఇక ఇటీవలే తన వ్యాపార లావాదేవీలు, ఆస్తుల బాధ్యతలను ఇకపై ముగ్గురు కొడుకులు చేసుకునేలా అల్లు అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారని విన్నాం. ఈ మేరకు ముగ్గురు తనయులకు ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయని తెలిసింది. దీంతో ఈ పరిణామం తర్వాత బన్నీ సొంతంగా ఓ స్టెప్ వేస్తున్నారని, ఇందులో భాగంగానే సర్వ హంగులతో ఆఫీస్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

    కొత్త ఇల్లు.. కోట్ల రూపాయలతో ఆఫీస్

    కొత్త ఇల్లు.. కోట్ల రూపాయలతో ఆఫీస్

    ఈ మధ్యే తన కొట్టింటికి కొబ్బరికాయ కొట్టేసిన అల్లు అర్జున్.. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన కొత్త ఆఫీస్ నిర్మించబోతున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ఏరియాలో ఈ ఆఫీస్ నిర్మాణ పనులు చక చకా జరిగిపోతున్నాయట. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేని విధంగా ఈ ఆఫీస్ సర్వ హంగులతో రూపుదిద్దుకుంటోందని సమాచారం.

    తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు లేనివిధంగా

    తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు లేనివిధంగా

    కాస్ట్లీ డెకార్స్‌తో పాటు ఖరీదైన ఇంటీరియర్ ఈ ఆఫీస్ ప్రత్యేకత అని తెలుస్తోంది. ఇక ఇందులో ఫ్యాన్స్, విజిటర్స్ కూర్చోడానికి.. వాళ్లతో సంభాషించడానికి వీలుగా మీటింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారట. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడటానికి కూడా ఓ అఫీషియల్ గదిని కేటాయిస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోకు ఇంతా భారీ ఆఫీస్ లేదని, బన్నీ అలా స్కెచ్ వేశాడని టాక్ నడుస్తోంది.

    Recommended Video

    #CineBox: Tapsee Strong Counter To Reporter | Prabhas Fans Urges For #Prabhas20 Update
    సినిమాల్లోనూ దూకుడు.. త్రివిక్రమ్, సుకుమార్

    సినిమాల్లోనూ దూకుడు.. త్రివిక్రమ్, సుకుమార్

    ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఈ స్టైలిష్ స్టార్.

    English summary
    Stylish Star Allu Arjun spent huge money for his new office. As par latest talk this office will have official rooms and environment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X