ప్రభాస్ అంటే అల్లు అర్జున్ కు ఎందుకు అంత పిచ్చి...?
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. అందులో ఎక్కువగా ప్రిన్స్ మహేష్ బాబు చాలా అందంగా ఉంటాడని, బన్నీ బాగా డాన్సులు చేస్తాడని ఇలా ఒక్కొక్కరి టాలెంట్ పై ఫ్యాన్స్ క్రియేట్ అవుతూ ఉంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరడుగుల అందగాడుగా, మాస్ కి పెట్టింది పేరుగా, టాలీవుడ్ కండలవీరుడిలా అభివర్ణించే హీరో ప్రభాస్ కి మగాళ్లలోనూ అభిమానులు బాగానే ఉన్నారు.
మిగతావారి మాటెలా ఉన్నా కానీ ప్రభాస్ అంటే అల్లు అర్జున్ కి యమా పిచ్చి. తన సినిమా కోసం కంటే ప్రభాస్ సినిమా కోసం తెగ ఎదురు చూసే బన్నీ అతని సినిమా హిట్టయితే మాత్రం తెగ పండగ చేసేస్తాడు. వెంటనే ప్రభాస్ ని కలుసుకుని అతడిని కౌగిలింతలతో ముంచెత్తుతాడు. ఆడియో ఫంక్షన్స్ లో కూడా ప్రభాస్ అంటే తనకెంత ఇష్టమో చెప్పడానికి అస్సలు వెనుకాడని బన్నీకి ప్రభాస్ అంటే ఇంత ఇదేంటో కానీ బహుశా స్నేహారెడ్డికి కూడా తన భర్తకి మరో మగాడిపై ఉన్న ఈ పిచ్చికి పిచ్చెక్కుతుందేమో అంటూ ఇండస్ట్రీలో జోకులు పేలుతున్నాయి..


Click it and Unblock the Notifications











