Allu Arjun: అల్లు అర్జున్ క్రేజీ లైనప్.. ప్రశాంత్ నీల్ తో సినిమా ఎప్పుడంటే?

Allu Arjun Lineup: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా ఇమేజ్‌ను దాటి గ్లోబల్ రేంజ్‌లో తన మార్కెట్‌ను పెంచుకుంటున్న స్టార్ హీరో. పుష్ప 2 (Pushpa 2: The Rule) తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం బన్నీ రాబోయే సినిమాలపైనే పడింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల కంటే, రాబోయే లైనప్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్లతో పాన్ వర్డల్ స్థాయి ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో బన్నీ క్రేజీ లైనప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం బన్నీ చేతిలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్ట్ రాకా (Raaka). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు తెచ్చుకుంది. అట్లీ అంటే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మరో పేరు. ఇక బన్నీ అంటే స్టైల్, ఎనర్జీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'రాకా'పై అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

Allu Arjun Crazy Lineup When Will Bunny and Prashanth Neel Movie Finally Start

ఈ క్రమంలో విడుదలైన బన్నీ లుక్ అమాంతం పెంచేశాయి. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ లుక్‌లో బన్నీ అదరగొట్టారు. ఈ న్యూ అవతార్‌కు ఫిదా అయిపోయారు. గతంలో పుష్ప ప్రాంఛైజీలో వచ్చిన అమ్మవారి లుక్‌తో ఆయన చేసిన డ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అంతకు మించిన స్థాయిలో లేటెస్ట్ లుక్ ఉండడంతో అందరిలోనూ మూవీపై హైప్ మామూలుగా లేదు.

ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే ప్రాజెక్టులే ఇప్పుడు అసలు చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డ్రీమ్ కాంబినేషన్ అల్లు అర్జున్ - ప్రశాంత్ నీల్. కెజిఎఫ్‌, సలార్ వంటి భారీ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఏర్పరచుకున్న ప్రశాంత్ నీల్‌తో బన్నీ సినిమా వస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ వెంటనే సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

దానికి ప్రధాన కారణం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో భారీ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండటం. తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా రెండు భాగాలుగా రూపొందే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ పని తీరు ప్రకారం ఒక సినిమా పూర్తి స్థాయిలో ముగిసే వరకు మరొకదాన్ని స్టార్ట్ చేయరు. దీంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తయ్యాకే బన్నీ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదనంగా సలార్ 2 కూడా ఆయన లైనప్‌లో ఉంది.

అయితే ప్రశాంత్ నీల్ సినిమా ఆలస్యమైనా, బన్నీ మాత్రం ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. 'రాకా' పూర్తయ్యాక ఆయన వెంటనే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో #AA23 ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. యాక్షన్, స్టైలిష్ నేరేషన్, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేలో లోకేష్ ప్రత్యేకత తెలిసిందే. అలాంటి దర్శకుడితో బన్నీ సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం సహజం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా లెవల్‌లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది.

ఇక బన్నీకి అత్యంత సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లలో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ తోది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు విజయాలు సాధించాయి. అందుకే నాలుగో సినిమా గురించి వార్తలు వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్, బన్నీ స్టైల్ అన్ని కలిస్తే.. మరో భారీ హిట్ రావడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో కూడా కూడా ఒక ప్రాజెక్ట్ లైన్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. యానిమల్ మూవీతో తన క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన సందీప్ రెడ్డి వంగా, బన్నీ కోసం ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ యాక్షన్ డ్రామా సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సందీప్ - బన్నీ కాంబోలో సినిమా రాబోతుందని ఇండస్ట్రీ టాక్. ఇది నిజమైతే, బన్నీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

ఇప్పుడు బన్నీ తీసుకుంటున్న నిర్ణయాల్లో క్లారిటీ ప్లానింగ్ కనిపిస్తోంది. ఏ సినిమా చేస్తే.. తన మార్కెట్‌ను పెంచే, కొత్త ఇమేజ్ తీసుకువచ్చే, దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రాజెక్ట్స్ మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇదే కారణంగా ఆయన లైనప్‌ను 'డ్రీమ్ లైనప్'గా అభిమానులు పిలుస్తున్నారు. సినిమా సినిమాకూ తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లతో వరుస ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తూ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఇంకొంతకాలం వేచి చూడాల్సి వచ్చినా, ఆ లోపు అట్లీ, లోకేష్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో బన్నీ చేసే సినిమాలు థియేటర్లలో మామూలు హంగామా సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు.

Read more about: prashanth neel allu arjun Raaka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X