Allu Arha: క్రేజీ న్యూస్.. పవన్ కల్యాణ్ సినిమాలో అల్లు అర్హ.. ఆ పాత్రలో క్యూట్ గా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా ఫుల్ పాపులర్ అయ్యాడు. బన్నీ లాగే ఆయన గారాల పట్టి అల్లు అర్హ కూడా సూపర్ ఫేమస్. అల్లు అర్హ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇక ఈ తండ్రీ కూతురు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి సంబంధించిన వీడియోలు ఇది వరకు తెగ చక్కర్లు కొట్టేవి.

అందులో ముద్దుముద్దుగా అల్లు అర్హ పలికే మాటలు ఏంతో మందిని ఆకట్టుకున్నాయి. ఆ ముద్దుగొలిపే మాటలే అల్లు అర్హకు ఈ వయసులో సినీ అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇటీవల శాకుంతలం సినిమాకు డబ్బింగ్ చెప్పిన ఈ క్యూట్ బేబీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తుందని టాక్.

హీరోలు, హీరోయిన్స్ గా..

హీరోలు, హీరోయిన్స్ గా..

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ద్వారా యావత్ ప్రపంచవ్యాప్తంగా యమ పాపులర్ అయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఆయన కుమార్తే అల్లు అర్హ అంటే తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉండరు. సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. కొందరు హీరోలు, హీరోయిన్స్ గా చిత్రసీమలో అడుగుపెడితే మరికొందరు మాత్రం తమ చిన్నతనంలోనే అలరిస్తారు. అలాంటి వారిలో అల్లు అర్హ ఒకరు.

ఫొటోలు, వీడియోలు..

ఫొటోలు, వీడియోలు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ పేరుతోనే ఫేమస్ అయింది. ఆ తర్వాత ఎదుగుతోన్న క్రమంలోనే ఈ చిన్నారి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలకు.. పాటలకు.. అల్లరికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. అందుకే సోషల్ మీడియాలో అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. క్యూట్‌నెస్‌తో చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిపోయింది అల్లు అర్హ.

తన క్యూట్ మాటలతో..

తన క్యూట్ మాటలతో..

అల్లు అర్హ తన క్యూట్ మాటలతో సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ లేడీ ఒరియెంటెండ్ సినిమా శాకుంతలంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల విడుదల కూడా చేశారు. అందులో సింహంపై కూర్చుని అల్లు అర్హ ఇచ్చిన ఎంట్రీ అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఆ ట్రైలర్ కే అల్లు అర్హ ఎంట్రీ హైలెట్ గా నిలిచింది.

వైరల్ గా అర్హ డబ్బింగ్ పిక్..

వైరల్ గా అర్హ డబ్బింగ్ పిక్..

ఇక సమంత-గుణ శేఖర్ కాంబినేషన్ మూవీ శాకుంతలం సినిమాలో అల్లు అర్హ చిట్టి భరతుడి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల తన పాత్ర కోసం అల్లు అర్హ డబ్బింగ్ చెప్పింది. 6వ ఏటలోకి అడుగు పెట్టిన అల్లు అర్హ స్టూడియోలో డబ్బింగ్ చెప్పిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు అల్లు అర్జున్. ఈ పిక్ షేర్ చేస్తూ దానిపై హార్ట్ సింబల్ వేశాడు. దీంతో ఈ పిక్ కాస్తా ఇంటర్నెట లో తెగ వైరల్ అయింది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో..

హరీశ్ శంకర్ దర్శకత్వంలో..

అయితే అల్లు అర్హ శాకుంతలం సినిమా మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ఒక స్పెషల్ రోల్ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అల్లు అర్హ మరొక సినిమాలో కూడా అలరించనుందట.

అది ఎవరి సినిమానో కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా తమిళ చిత్రం తెరికి రీమెక్ అని వార్తలు వస్తున్నాయి.

పవన్ కల్యాణ్ కూతురిగా..

పవన్ కల్యాణ్ కూతురిగా..

అచ్చం తెరి సినిమాల కాకుండా డిఫరెంట్ యాంగిల్ ఉస్తాద్ భగత్ సింగ్ ను తెరకెక్కించనున్నాడట హరీశ్ శంకర్. అందులో హీరో బేకరీ నడుపుతుంటే ఇందులో పవన్ కల్యాణ్ లెక్చరర్ గా కనిపిస్తారని టాక్. ఇక ఈ సినిమాలో హీరోకు చిన్న పాప ఉంటుంది.

ఆ పాప పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కూతురిగా అల్లు అర్హ నటించనుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X