అదీ అల్లు అర్హ రేంజ్.. రెండో సినిమాకే నిమిషానికి రూ.20 లక్షలు.. 'దేవర'లో ఎంత సేపు కనపడనుందంటే?
అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో బన్నీ భార్య స్నేహరెడ్డి.. అర్హ వీడియోలు, పోస్టులు పెడుతూ ఉంటుంది. ఇక ఈ చిన్నారికి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. శకుంతలం సినిమాలో మెరిసిన అల్లు అర్హ నెక్ట్స్ ఎన్టీఆర్ దేవరలో కనిపించనుంది. ఇక ఈ సినిమాకు అర్హ రెమ్యూనరేషన్ నిమిషానికి రెండు లక్షలు అని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే....
అల్లు అర్హకు ప్రత్యేక క్రేజ్: అల్లు అర్హకు తనకంటూ ఓ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఇక అల్లు స్నేహ అర్హ వీడియోలు, పోస్టులు.. ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయగా.. వాటికి మంచి స్పందన వస్తూ ఉంటుంది. అర్హను తండ్రికి తగ్గ తనయగా నెటిజన్స్ ప్రశంసింస్తూ ఉంటారు.

తండ్రికి తగ్గ తనయ...: ఇక ఈ చిన్నారి సమంత నటించిన శాకుంతలం సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో భరతుడిగా అర్హ కనిపించి... ప్రేక్షకులను అలరించింది. భరతుడి క్యారెక్టర్ లో అర్హ ఒదిగిపోయి.. డైలాగులు చెప్తుంటే.. ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదీ అల్లు అర్జున్ వారసులు అంటే... బ్లడ్ ఎక్కడికి పోతుంది అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది.

దేవరలో అల్లు అర్హ: ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో అర్హ కనిపించనుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా, అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా.. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.
ఐదో షెడ్యూల్ షూటింగ్...: దేవర సినిమా ఇప్పటికే నాలుగ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఐదవ షెడ్యూల్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్యనే ఎక్కువగా సన్నివేశాలను చిత్రీకరించారట. జాన్వీ కపూర్ కూడా కొన్ని రోజులు షూటింగులో జాయిన్ అయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ బన్నీకి ఫోన్...
అసలు విషయం ఏమిటంటే... ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అర్హని అడిగారని సమాచారం. స్వయంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కు ఫోన్ చేసి.. ఇలా చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్హను తీసుకుందామని కొరటాల శివ అంటున్నాడు అని అడగ్గా... వెంటనే అర్జున్ ఓకే చెప్పారట. వచ్చే నెలలో అల్లు అర్హ పాత్ర కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
నిమిషానికి రెండు లక్షలు: ఇక ఈ సినిమాలో అల్లు అర్హ పాత్ర 10 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ పది నిమిషాలకు అర్హ రూ. 20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. అంటే ఒక్కో నిమిషానికి రెండు లక్షల రూపాయిలు అన్నమాట. దీంతో అదీ అల్లు అర్హ రేంజ్.. అని నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక అల్లు అర్హ తండ్రి తగ్గ తనయగా మారిందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











