జూ ఎన్టీఆర్ దర్సకుడుతో చర్చలు జరుపుతున్న అల్లు అర్జున్
జూ ఎన్టీఆర్ తో గతంలో అశోక్, ఇప్పుడు ఊసరవిల్లి చిత్రాలు రూపొందిస్తువ్న దర్శకుడు సురేంద్రరెడ్డి. అతని దర్సకత్వంలో చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పిలిపించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్టోరీ లైన్ తో వచ్చి కలుస్తానని సురేంద్ర రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేంద్ర రెడ్డి పూర్తిగా ఊసరి విల్లి ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. తమన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. అలాగే అల్లు అర్జున్ తన తాజా చిత్రం బద్రీనాధ్ ఫినిషింగ్ టచెస్ లో ఉన్నారు. వివి వినాయిక్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా కనిపించనున్నాడు. ఇప్పుడికే అల్లు అర్జున్ బాడీ చూపిస్తూ వేసిన పోస్టర్స్ అంతటా మంచి క్రేజ్ ని క్రియోట్ చేసాయి.


Click it and Unblock the Notifications











