For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ అయితే పబ్లిసిటీ ప్లస్ అవుతుంది: అల్లు అర్జున్

    By Sindhu
    |

    ప్రస్తుతానికి విజయాల మోతాదు కాజల్ ఖాతలోనే ఎక్కువగా ఉండటంతో ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవటానికి టాలీవుడ్ హీరోలు పోటి పడుతున్నారు. వరస పరాజయాలతో హిట్టుల రేసులో కొద్దిగా వెనకబడి ఉన్న బన్నీ కాజల్ అదృష్టాన్ని నమ్ముకున్నట్టు కనపడుతుంది. బన్ని నే కాకుండా గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్, బిజినెస్ మాన్ తో మహేష్ బాబు కూడా కాజల్ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

    అల్లు అర్జున్ కి కాజల్ కావాలట. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించనుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నా, ఇలియానా విషయమై అల్లు అర్జున్ అంత ఆసక్తి ప్రదర్శించడంలేదట. ఇలియానాతో చేయడంకన్నా, కాజల్ ని పెట్టుకుంటే పబ్లిసిటీకి ప్లస్ అవుతుందన్నది బన్నీ ఆలోచన అట. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కాజల్ పేరు సూచించినా, త్రివిక్రమ్ మాత్రం ఇలియానా వైపే మొగ్గు చూపుతున్నాడట.

    అయితే అర్జున్ కీ, త్రివిక్రమ్ కీ ఇద్దరికీ ఇప్పుడు ఒక హిట్ ఇమ్మీడియేట్ గా అవసరం కాబట్టి, ఇద్దరూ బాగా కష్టపడే యోచనలో ఉన్నారు కాబట్టి ఈ సినిమాలో మొదట్లో ఇలియానాను కథానాయికగా అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆమెకు మార్కెట్ లేకపోవడంతో, సక్సెస్ లో వున్న కాజల్ ను పెట్టుకొంటే పెద్ద హిట్ కొట్టొచ్చనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందుకే అల్లు అర్జున్-త్రివక్రమ్ ల సినిమా డిలే అవుతుందని సమాచారం.

    ప్రస్తుతం ఇలియానా, కాజల్ ల మధ్య నడుస్తోన్న ఫైట్ ముగిశాక, వారిలో ఎవరి పేరు ఫైనల్ అవుతుందోగానీ, ఈ సినిమా సెట్స్ మీదకు రావడానికి ఇంకా చాలా టైమ్ పడ్తుందన్నది లేటెస్ట్ న్యూస్. ఆర్య2 సినిమాలో అల్లు అర్జున్, కాజల్ జంటగా నటించిన సంగతి విదితమే.

    English summary
    We have earlier reported that Allu Arjun gave a nod for Trivikram Srinivas new film.Trivikram Srinivas to direct Stylish Star Allu Arjun in a new film which as all set to kick start its shooting soon. Now the latest buzz we hear from the close sources is that Allu Arjun demand for Kajal Agarwal for his movie..that is help to publicity and hit the cinema too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X