Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రామ్ చరణ్ చేయాల్సిన కథలో అల్లు అర్జున్.. యూ టర్న్ తీసుకున్న యువ దర్శకుడు!
ఇండస్ట్రీలో కాంబినేషన్స్ పై పెరిగే అంచనాలు మామూలుగా ఉండవు. హీరో డైరెక్టర్ కాంబినేషన్ అంటే ఇప్పుడు మార్కెట్ లో మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు సీనియర్ దర్శకులను ఎక్కువగా నమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు యువ దర్శకులను కూడా ఒక అంచనా వేసి, సినిమా చేయడానికి చాలా ఫాస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్ వస్తోంది.
పవర్ఫుల్ కథలతో అల్లు అర్జున్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకేసారి నాలుగైదు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నాన్ స్టాప్ గా షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా వచ్చే రెండు మూడేళ్లకు సరిపోయేలా పవర్ఫుల్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.
పుష్ప సినిమాతో బిజీగా
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఆ సినిమా కోసం బన్నీ నెవర్ బిఫోర్ అనేలా కష్టపడుతున్నాడు. చాలా రోజుల తరువాత డిఫరెంట్ సినిమా చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాపై నార్త్ జనాల్లో లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఆ తరువాత కొరటాల శివతో
పుష్ప అనంతరం స్టైలిష్ స్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి నీటి. కాలుశ్యానికి సంబంధించిన సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల ఆచార్య అనంతరం వెంటనే ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ ఏండింగ్ నుంచి స్టార్ట్ కావచ్చని టాక్.
రామ్ చరణ్ చేయాల్సిన కథలో..?
అలాగే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో కూడా సినిమా చేయాలని గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గౌతమ్ హిందీలో జెర్సీ షూటింగ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక మొదట రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకోగా.. ఎందుకో మళ్ళీ యూ టర్న్ తీసుకొని బన్నీ దగ్గరకు ఆ కథను తీసుకివెళ్లినట్లు సమాచారం.