Allu Arjun: యువ దర్శకుడిని లైన్ లో పెడుతున్న ఐకాన్ స్టార్.. మరో బిగ్ పాన్ ఇండియా ప్లాన్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నప్పటి నుంచి కూడా తదుపరి సినిమాలను అంతకుమించి అనేలా ప్రాజెక్టులను లైన్లో పెట్టాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న బన్నీ దాంతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కెట్ ను అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు దాదాపు 700 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక బన్నీ దీని తర్వాత రాబోయే సినిమాలు కూడా అంతకుమించి అనేలా ఉండాలి అని చర్చలు అయితే జరుపుతున్నాడు. ఇప్పటికే అధికారికంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ తో ఒక సినిమా చేయనన్నట్లుగా ప్రకటన ఇచ్చారు. ఆ ప్రాజెక్టును టీ సిరీస్ నిర్మించనుంది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేసేందుకు బన్నీ చర్చలు జరుపుతున్నాడు. రేపో మాపో ఆ ప్రాజెక్టు పై అధికారికంగా క్లారిటీ అయితే రాబోతోంది.

Allu arjun discussion with another young director for a big movie

అలాగే అల్లు అర్జున్ మరో యువదర్శకుడి పై కూడా ఫోకస్ పెంచినట్లుగా తెలుస్తోంది. నానితో ఇటీవల బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ చూసిన శ్రీకాంత్ ఓదెలా కూడా బన్నీతో సినిమా చేసే అవకాశం ఉందట. శ్రీకాంత్ దసరా సినిమాతో 100 కోట్ల దర్శకుడిగా గుర్తింపును అయితే అందుకున్నాడు. ఇక ఇప్పుడు అతన్ని ఒక మంచి ఫ్యాన్ ఇండియా కదా ఉంటే సెట్ చేసుకోమని బన్నీ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇదివరకే ఒక కథపై కూడా వీరిద్దరి మధ్యలో చర్చలు జరిగాయట. కానీ అల్లు అర్జున్ ఆ కథపై అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇక దర్శకుడు ప్రస్తుతం మరొక కథ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాతనే బన్నీతో మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక కథ ఫైనల్ అయితే ప్రాజెక్టుపై అధికారికంగా క్లారిటీ ఇవ్వడానికి ఎంతో సమయం పట్టదు అని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X