అల్లు అర్జున్, రాజమౌళి కాంబినేషన్ లో త్రీడి చిత్రం!?
అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాధ్ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. వరసగా సినిమాలు ఫెయిల్యూర్స్ అవుతూండటంతో అల్లు అర్జున్ ఇప్పుడు వరస హిట్స్ రాజమౌళితో చేస్తే బెస్ట్ అని అల్లు అరవింద్ నిర్ణయించాడని సమాచారం. అందులోనూ ఈగ చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి కూడా మరింత లేటెస్ట్ టెక్నాలిజితో తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేయాలనుకుంటన్నాడు. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ ఈ త్రిడీ ఐడియాను రాజమౌళి ముందు ఉంచినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులోనూ త్రిడీ సినిమా అయితే దేశ,విదేశాల్లో కూడా మార్కెట్ ఉంటుందని ఆయన బిజెనెస్ బుర్ర లెక్కలు వేసి తేల్చి ఈ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. అయితే ఇంకా రాజమౌళి మాత్రం తన నిర్ణయాన్ని చెప్పలేదని, ప్రభాస్ సినిమా తర్వాత చేసే ఈ సినిమా గురించి తనకు ప్రస్తుతం ఏ ఆలోచన లేదని కొంత టైమ్ అడిగినట్లు చెప్తున్నారు. అదీ మ్యాటర్.


Click it and Unblock the Notifications











