అల్లు అర్జున్ గదికి వాస్తు మార్పులు
అల్లు అర్జున్ ది బద్రీనాధ్ ప్లాప్ కావటంతో అది వాస్తు సమస్యే అని తేల్చి నట్లున్నారు. దాంతో ఆయన తండ్రి అల్లు అరవింద్ అతని గదికి వాస్తు మార్పులు చేస్తున్నట్లు ఓ ఇంగ్లీష్ డైలీ వార్తను ప్రచురించింది. అందులో ..అల్లు అరవింద్ ఓ వాస్తు కన్సల్టెంట్ ని సంప్రదించి ఆయన సూచన మేరకు ఈ మార్పులు చేయిస్తున్నట్లు చెప్తున్నారు. జూబ్లిహిల్స్ లో ని వారి ఇంటి పై వాటాలో అల్లు అర్జున్ గదిని మార్పులు చేస్తున్నారు. అయితే ఆ ఫ్యామిలీకి చెందినవారు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. టాప్ ప్లోర్ లోని అల్లు అర్జున్ రూమ్ ని ఎక్సపేండ్ చేస్తున్నాము అంతేగానీ...వాస్తు మార్పులు చేయటం లేదు అన్నారు. వివాహం కావటంతో మరింత ప్లేస్ కావాలనే ఈ మార్పులు అని చెప్తున్నారు.
ఇక కొద్ది రోజుల క్రిందట మహేష్ సైతం తన ఇంటి వాస్తు బాగుండటం వల్లనే తన సినిమాలు హిట్ అవుతున్నాయని మీడియాతో అన్నారు. తను కొత్త ఇంటిలోకి మారిన తర్వాత దూకుడు,బిజినెస్ మ్యాన్ హిట్స్ వచ్చాయని చెప్పాడు. సినిమా కోట్లతో కూడిన వ్యాపారం కాబట్టి సెంటిమెంట్స్ తప్పవని,దాన్ని తప్పు పట్టాల్సిన పనిలేదని ఈ విషయం తెలిసిన కొందరు సీనియర్స్ వ్యాఖ్యానించటం గమనార్హం. ప్రస్తుతం మహేష్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతోంది. కామిడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











