అల్లు అర్జున్ కొత్త లుక్ వెనుక ఇంత మేటర్ ఉందా.? అందుకే కనిపించకుండా వెళ్లిపోయాడా.?

By Manoj

అల్లు అర్జున్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టైలిష్ హీరోల్లో ఒకడు. మెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగానికి పరిచయం అయినప్పటికీ.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. అదే సమయంలో సినిమా సినిమాకూ సరికొత్త స్టైల్‌ను పరిచయం చేస్తూ యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ లుక్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే...

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ

హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. దీంతో ‘బాహుబలి' తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ - బన్నీ ఖాతాలో హ్యాట్రిక్‌తో పాటు ఇండస్ట్రీ హిట్ కూడా వచ్చి చేరింది.

బన్నీ లేకుండానే సినిమాను మొదలైంది

బన్నీ లేకుండానే సినిమాను మొదలైంది

‘అల.. వైకుంఠపురములో' షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈ షెడ్యూల్‌లో బన్నీ లేని సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే అతడు కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడు.

కథ మాత్రం అదే.. మార్పులు చేశారట

కథ మాత్రం అదే.. మార్పులు చేశారట

ఈ సినిమాను ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన అంశాలతో తెరకెక్కిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఇందులో అల్లు అర్జున్ కూడా స్మగ్లర్‌గా కనిపిస్తాడని కొందరు అంటుండగా.. ఆ ముఠాకు సహకరించే లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే, మొదట అనుకున్న కథలో కొన్ని మార్పులు చేశారని సమాచారం.

అజ్ఞాతంలోకి అల్లు అర్జున్.. అందుకేనట

అజ్ఞాతంలోకి అల్లు అర్జున్.. అందుకేనట

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఫుల్ మాస్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం గుబురు గెడ్డంతో పాటు రింగుల జుట్టుతో అతడు కనిపించబోతున్నాడట. ఇందులో భాగంగానే ఈ మెగా హీరో దాదాపు రెండు నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్తున్నాడని సమాచారం. వచ్చిన వెంటనే నిర్విరామంగా షూటింగ్‌లో పాల్గొంటాడని టాక్.

Recommended Video

Allu Arjun Excellent Speech At Ala Vaikunthapurramloo Success Meet
కొత్త లుక్ వెనుక ఇంత మేటర్ ఉందా.?

కొత్త లుక్ వెనుక ఇంత మేటర్ ఉందా.?


అల్లు అర్జున్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతున్న సమయంలోనే... దీనికి సంబంధించిన ఓ న్యూస్ తాజాగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. పాత తరం నాటి గెటప్ కోసం గెడ్డం పెంచుతుండగా... ఇప్పటి జనరేషన్ హీరోగా కనిపించడానికి మాత్రం ఎంతో స్టైలిష్‌గా దర్శనమిస్తాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X