Allu Arjun: కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అల్లు అర్జున్ ప్రచారం.. ఎన్నికల రంగంలోకి ఐకాన్ స్టార్!

ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగానే సినిమాల్లో అడుగుపెట్టినప్పటికీ... తన అభినయం, టాలెంట్ తో విపరీతమై క్రేజ్ తెచ్చుకున్నాడు. ఐకాన్ స్టార్ గా మారిపోయి.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఈయన తాజాగా రాజకీయాల్లోకి వస్తున్నారు. అలా ఎక్కడ నుంచి ఆయన పోటీ చేయట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. పొలిటికల్ ఎంట్రీ కంటే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడమే కాస్త విడ్డూరంగా ఫీల్ అవుతున్నారు. ఆయన ఏమైనా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే తన మేనమామ... పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరాలి, లేదా ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే జనసేనకు చేయాలి... ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనాలి. కానీ షాకింగ్ గా ఈయన కాంగ్రెస్ కు సపోర్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

 Allu Arjun Election Campaign For His Father Inlaw Chandra Sekar Reddy Check Details

అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకుందని తన మామయ్య కోసమే. మామయ్య అనగానే.. మెగా హీరోలు అనుకుంటున్నారామే... మేనమామలు కాదు.. పిల్లనిచ్చిన మామ. అంటే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కోసం బన్నీ ఈ డెసీషన్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. స్నేహా రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

కేవలం పార్టీలో చేరడం మాత్రమే కాదండోయ్.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ ఆలోచన మనసులో ఉండడంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ విషయాల గురించి చర్చించినట్లు కూడా సమాచారం. అయితే చంద్రశేఖర్ రెడ్డి.. గతంలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన మాల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అదే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పగా.. సీటు నీకే కన్ఫార్మ్ చేస్తామని హామీ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది.

 Allu Arjun Election Campaign For His Father Inlaw Chandra Sekar Reddy Check Details

ముఖ్యంగా మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున.. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డియే పోటీ చేస్తారని.. ఆయనకు సీటు ఖరారైందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇదే కనుక నిజం అయితే అల్లు అర్జున్.. మామ తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారట. తన గెలుపు కోసం అల్లుడు అల్లు అర్జున్ తప్పకుండా కృషి చేస్తారని చంద్రశేఖర్‌ రెడ్డి వివరిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X