Pushpa 2లో అల్లు అర్జున్ ఎంట్రీ సాంగ్.. ఏయ్ బిడ్డాకు మించి కంపోజింగ్!
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటిన చిత్రాల్లో పుష్ప ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు యావత్ ప్రపంచం ఫిదా అయింది. అందుకే ఇప్పుడు తెరకెక్కిస్తున్న పుష్ప 2. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగా చిత్రీకరిస్తూ సంసిద్ధం అవుతున్నాడు సుకుమార్. ఇప్పటికే టీజర్, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
జాగ్రత్తలు తీసుకుంటూ
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో మరోసారి వస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా నటీనటుల నుంచి టేకింగ్ వరకు సుకుమార్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు, బిగ్ బాస్ దివి, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించనున్నారు.

నెట్టింట్లో ట్రెండ్
పుష్ప 2 సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా దానికంటే ఒక్క రోజు ముందుగా ఏప్రిల్ 7న విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన వచ్చింది. మూడు నిమిషాలు ఉన్న టీజర్ లో అల్లు అర్జున్ కు హై రేంజ్ ఎలివేషన్ ఉండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ అమ్మవారి గెటప్పులో కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.
ఐటీ దాడులు
ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ పేరు మారిమోగిపోతూ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అందుకు తగినట్లుగా పుష్ప 2 విడుదల తేది, ప్రమోషన్స్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో ఐటీ దాడులు జరుగుతున్నందను ప్రస్తుతం షూటింగ్ ను నిలిపివేశారు.

ఏప్రిల్ 7న
'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్ పూర్తి కావడంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఉన్నాయట. అందుకే పుష్ప 2 చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024వ సంవత్సరంలో సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని టాక్. అందుకోసం 2024 ఏప్రిల్ 7వ తేదీని పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ నుంచి ఇది వరకు ఓ సమాచారం అయితే అందింది.
మరో చార్ట్ బస్టర్
ఇదిలా ఉంటే పుష్ప మూవీలో ఏయ్ బిడ్డా అనే అల్లు అర్జున్ ఎంట్రీ సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. అందులోని లిరిక్స్ ఎంతో అర్థవంతంగా ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2లో అంతకుమించిన రేంజ్ లో అల్లు అర్జున్ సాంగ్ ఉంటుందట. అది కూడా హీరో పాత్ర క్యారెక్టరైజేషన్ తో ముడిపడ్డ పాటనట సేమ్ ఏయ్ బిడ్డా తరహాలో ఉన్నప్పటికీ మరింత అదిరిపోతుందని అంటున్నారు. చంద్రబోస్ సాహిత్యానికి దేవీ శ్రీ ప్రసాద్ ఊపునిచ్చే మ్యూజిక్ తో చార్ట్ బస్టర్ అవుతందని టాక్ నడుస్తోంది.



Click it and Unblock the Notifications











