అల్లు అర్జున్ కన్ను ఆ సినిమాపై పడిందా.. తొలిసారి రీమేక్!
నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ మరో సినిమా ప్రారంభించలేదు. ఈ చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తోంది. కానీ బన్నీ కొత్త చిత్రం విషయంలో ఇంకా సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు విక్రమ్ కుమార్ దర్శత్వంలో సినిమా అంటూ వార్తలు వచ్చినా ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లినట్లు తెలుస్తోంది. బన్నీ దర్శకుల జాబితాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు బలంగా వినిపిస్తోంది. అల్లుఅర్జున్ తదుపరి చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

అరవింద సమేత విజయంతో
అజ్ఞాతవాసి చిత్ర పరాజయం నిరాశపరిచినా అరవింద సమేత చిత్రంతో త్రివిక్రమ్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. బన్నీ కూడా నా పేరు సూర్య చిత్ర పరాజయంతో నిరాశలో ఉన్నాడు. తన అభిమానులకు మంచి చిత్రం అందించాలంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాత్రమే సాధ్యం అని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హిందీ సినిమాపై బన్నీ కన్ను
ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్లు తాజగా జరుగుతున్న ప్రచారం ఆసక్తిగా మారింది. హిందీలో సోనుకే టిటు కి స్వీటీ చిత్రం ఘనవిజయం సాధించింది. ఏ ఏడాది విడుదలైన ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.

కథలో మార్పులు చేసి
తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి రీమేక్ చేస్తే మంచి విజయం సాధిస్తుందనే ధీమాతో బన్నీ ఉన్నాడట. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం అలరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర రీమేక్ కు సంబందించిన అధికారిక ప్రకటన రావలసి ఉంది.

రీమేక్ అంటే సాహసమే
అల్లు అర్జున్ ఇంతవరకు రీమేక్ చిత్రంలో నటించలేదు. ఈ చిత్రం ఒకే అయితే బన్నీ నటించబోతున్న తొలి రీమేక్ చిత్రం అవుతుంది. అలాంటి సాహసం బన్నీ చేస్తాడా అనే ఆసక్తి నెలకొని ఉంది. పైగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అంటే ఆడియన్స్ పవర్ ఫుల్ కాన్సెక్ట్ కోరుకుంటారు. ఈ సందేహాలన్నింటికీ సమాధానం దొరకాలంటే బన్నీ స్పందించే వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











