అల్లు అర్జున్ సరసన శృతి హాసన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కన్ను ఇప్పుడు శృతిహాసన్ పై పడింది. సెవెంత్ సెన్స్,ఓహ్ మై ప్రెండ్ చిత్రాల్లో ఆమె నటనను చూసిన అల్లు అర్జున్ ఇప్పుడు తన చిత్రంలో బుక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. తన తదుపరి చిత్రంలో ఆమెను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్సకత్వంలో రూపొందే చిత్రంలో ఆమెను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ .. ఇలియానాతో రొమాన్స్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ కాంబినేషన్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పైటింగ్ సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది. చలిలో వణుకుతూ మరీ ఈ పైట్ సీన్స్ లో చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కామిడీ,యాక్షన్ కలగలిపిన చిత్రంగా చెప్తున్నారు. శృతిహాసన్ మరో ప్రక్క తమిళ చిత్రాల్లో బిజీగా ఉంది. ఆమె చేసిన త్రీ చిత్రం ఇప్పటికే క్రేజ్ క్రియేట్ చేసింది. ధనుష్ బార్య దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆమె తన చిత్రాలను ఆచి తూచి ఎంచుకుంటోంది. తెలుగులో ఆమె చేసిన చిత్రాలేవి ఇప్పటివరకూ ఆడలేదు. ఆ మధ్య దమ్ము చిత్రం ఓకే చేసింది కానీ ఆ తర్వాత డేట్స్ ఎడ్జెస్ట్ కాక తప్పుకుంది.


Click it and Unblock the Notifications











