Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘వరుడు’సక్సెస్ కోసం అల్లు అర్జున్ అంకెల గారెడి
అల్లు అర్జున్ ఇప్పటికి వరకూ చేసిన సినిమాలు ఒక ఎతైతే 'వరుడు" చిత్రం మరో ఎత్తు అయినది. ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనీ మొదటి నుండి దర్శకుడు గుణశేఖర్ చెబుతున్న మాటలను ఒక్కసారి పరిశీలిస్తే ఆయన చెప్పినది కరెక్టే కాకపోతే హిట్ కు బదులు ఆయన చెప్పిన మాటలలో ప్లాప్ అని ఉండాల్సింది. అదొక్కటి తప్పు చెప్పడని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.
అయితే అల్లు అర్జున్ కెరీర్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోయిన అల్లు అర్జున్ కి 'ఆర్య 2" నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది. 'ఆర్య2" కమర్షియల్ గా కాస్త సేఫ్ అయినా, 'వరుడు" మాత్రం పూర్తిగా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది తొలి రోజే. అల్లు అర్జున్ కెరీర్ లోనే 'బ్యాడ్" చిత్రంగా విమర్శకులు, విశ్లేషకులు, ట్రేడ్ పండితులు తేల్చి చెబుతున్నారు.
అల్లు అర్జున్ మాత్రం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అంటూ 'వరుడు" కి పబ్లిసిటీ చేసేస్తున్నాడు. మొదటి రోజు 7 కోట్ల 28 లక్షల రూపాయల వసూళ్ళని ప్రకటించిన బన్నీ, తాజాగా రెండో వారం నాటికి 14 కోట్లకు పైగానే లెక్క చెప్తున్నాడు. సక్సెస్ మీట్ తో పాటు, సక్సెస్ యాత్రలోనూ బిజీగా వున్న అల్లు అర్జున్ వున్నంతలో తన సినిమాని 'హిట్" అన్పించేందుకోసం నానా తంటాలూ పడ్తున్నాడు. ఈ లెక్కలు ఎన్నాళ్ళు కొనసాగిస్తాడోగానీ, 'బద్రినాథ్" తో మళ్ళీ బన్నీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అతని అభిమానులు కోరుతున్నారు.