డేంజర్ జోన్‌లోకి అల్లు అర్జున్ ఆర్మీ .. 'అతి'కి పోయి కష్టాల్లోకి?

రీసెంట్‌గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో ఊపేసిన ఘటన ఏంటో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హీరో , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 భారీ వసూళ్లతో పాటుగా ఊహించని కాంట్రవర్సీలు కూడా అందుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 5 రిలీజ్ కానుండగా.. దాని కంటే ముందే నాలుగో తేదీ రాత్రి స్పెషల్ షోస్‌తోనే సినిమా మొదలు కావడమే పెద్ద సమస్యకి దారి తీసింది.

హైదరాబాద్‌లో ప్రముఖ సింగిల్ స్క్రీన్ సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో ఓ నిండు ప్రాణం కోల్పోగా ఇపుడు ఓ ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్‌ని కూడా తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలవ్వగా.. ఆ వెంటనే సినీ ప్రముఖులంతా కలవడం వంటివి జరిగి టాలీవుడ్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

allu arjun fans are now in danger will he come for his army

ఈ నేపథ్యంలోనే కాంట్రవర్సీ మరింత హీట్ లోకి కూడా వెళ్ళింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పలు కామెంట్స్ , కొన్ని ఘటనలు అల్లు అర్జున్‌ని ఇరికించే ప్రయత్నం చేసినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి , తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.

ఇపుడు ఇదే అల్లు అర్జున్ ఫాన్స్‌కి షాకిచ్చింది. ఆల్రెడీ అల్లు అర్జున్‌నే అరెస్ట్ చేసిన పోలీసులు ఇపుడు తన ఫ్యాన్స్‌ని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైతే ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో దూషిస్తూ నెగిటివ్ పోస్ట్‌లు, కామెంట్స్ పెట్టారో వారికి తెలంగాణ పోలీసులు షాకిచ్చే ఏర్పాట్లలో ఉన్నారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కొందరి అకౌంట్స్ రౌండప్ చేసి వారిని అరెస్ట్ చేసి తమ స్టైల్ ట్రీట్మెంట్‌ని ఇవ్వబోతున్నారట. దీంతో అల్లు అర్జున్ అభిమానులు బిక్కుబిక్కుమంటున్నారు. మరి అభిమానులను కాపాడటం కోసం అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మరి చూడాలి ఈ హైడ్రామా అంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుంది అనేది. మరోపక్క పుష్ప 2 మాత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది అని ట్రేడ్ వర్గాలు, మేకర్స్ చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X