టాలీవుడ్ లో ఇలియానాకి ఐరెన్ లెగ్ అని ముద్ర...!
'నేను నా రాక్షసి" సినిమా విషయంలో మాట తప్పనని చెబుతోంది సెక్సీ బ్యూటీ ఇలియానా. సినిమాపై ఎన్ని విమర్శలు వస్తున్నా, 'నేను నా రాక్షసి" తనకు బాగా నచ్చిన సినిమా అనీ, తాను చాలా ఇష్టపడి చేసిన సినిమా అనీ ఇలియానా పబ్లిసిటీ ఊదరగొట్టేస్తోంది. 'శక్తి" సినిమా విషయంలో దర్శక నిర్మాతలపై ఘాటైన ఆరోపణల గుప్పించిన ఇలియానా, 'నేను నా రాక్షసి" సినిమా గురించి మాత్రం పాజిటివ్ పబ్లిసిటీకే కట్టుబడి వుంది.
కాగా సబ్జెక్ట్ చెప్పినప్పుడే ఇలియానా సినిమాపై చాలా ఆసక్తి ప్రదర్శించిందనీ, సినిమాలో ఆమె ఫెర్ఫామెన్స్ అదుర్స్ అనీ, ఇలియానా నటించిందనడం కన్నా'నేను నా రాక్షసి" సినిమాలో జీవించేసిందని దర్శకుడు పూరి జగన్నాథ్ చెబుతున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్ ఎవరి కెరీర్ లోనైనా సహజమేననీ, ఫలితమెలా వున్నా, 'నేను నా రాక్షసి" తన కెరీర్ లోనే ఓ డిఫరెంట్ ఫిల్మి అనీ ఇలియానా బల్లగుద్ది మరీ చెబుతోంది. అయితే శక్తి, నేను నా రాక్షసి ప్లాప్ తో ఇలియానాకి ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ప్రస్తుతం ఇలియానాకి తెలుగులో అల్లు అర్జున్ ఒక్కరితోనే ఒకే ఒక సినిమా ఉంది. అందుకు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇలియానాతో సినిమా అంటే భయపడుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం తెలుగులో ఇలియానా నటిస్తున్న ఒకే ఒక చిత్రం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ. తమిళ్ లో శంకర్ డైరెక్షన్ లో 'నన్ బన్", రజనీకాంత్ రానా చిత్రాలలో నటిస్తోంది. హిందీలో బర్ఫీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాలతో ఇలియానా పాపులారిటీ పెరుగుతుందా? లేక ఇంటిదారి పడుతుంది తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగక తప్పదు.


Click it and Unblock the Notifications











