అల్లు అర్జున్ తో గోపీచంద్ దర్శకుడు ఖరారు?

ఈ సినిమా గురించి రవికుమార్ చౌదరి చెబుతూ ' యూత్‌ఫుల్‌గా ఉండే సినిమా ఇది. కథనం కొత్త తరహాలో ఉంటుంది. నేను చెప్పిన కథ వినగానే అరవింద్‌గారు, దిల్ రాజుగారు వెంటనే ఓకే చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓ యువ కధానాయకుడు ఇందులో నటిస్తారు. కథ తయారైంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం. సెప్టెంబర్ నెలాఖరున కానీ, అక్టోబర్ మొదటి వారంలో కానీ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత' అన్నారు. ఈ చిత్రానికి బి.వియస్ ఎన్ రవి కథ అందిస్తున్నట్లు సమాచారం.
ఇక అల్లు అర్జున్ తాజాగా పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటై ఉన్నారు. అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..' చిత్రం సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్ ఈ మేరకు స్కిప్టు వినిపించటం జరగింది. అది విన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం. అసలు కరెక్షన్ ఏమీ చెప్పలేదని,ఈ చిత్రం తన కెరిర్ లో మరోసారి దేశముదరు రేంజిని దాటే హిట్ వస్తుందని నమ్మి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తున్నారు.
ఇక ఈ చిత్రం షూటింగ్ మొత్తం అబ్రాడ్ లో జరపనున్నట్లు పూరీ జగన్నాధ్ తెలియచేసారు. బ్యాంకాక్ లో షూటింగ్ మొదలయ్యి అమెరికాలో జరగనుందని తెలుస్తోంది. దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,పూరీ జగన్నాధ్ ని రిపీట్ చేస్తూ బండ్ల గణేష్ రూపొందించే ఈ చిత్రం బారీగా రూపొందనుంది. హీరోయిన్స్ సెంట్రల్ గా నడిచే కధ కాబట్టి ఆ టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చేసే ఇద్దరు హీరోయిన్స్ లో తాప్సీ ని ఎంపికచేసారు. మరొకరు కోసం చూస్తున్నారు. 2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం.


Click it and Unblock the Notifications











