For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR 30: ఆ హీరో రిజెక్ట్ చేసిందే.. సైలెంట్ గా అలా మార్చేసిన కొరటాల శివ.. పోస్టర్స్ వైరల్!

  |

  టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న వారిలో ఎన్టీఆర్ కూడా టాప్ లిస్టు లో ఉన్నాడు. RRR సినిమా సక్సెస్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ కు అగ్ర దర్శకుల నుంచి చాలా పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ తరుణంలో ఎన్టీఆర్ ఎంతో ఆలోచించి గాని ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం లేదు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల మొదలుపెట్టిన 30 ప్రాజెక్టు కు సంబంధించిన మోషన్ పోస్టర్ అయితే వైరల్ గా మారుతోంది.

  అయితే ఇదివరకే ఒక హీరో ఈ ఈ కాన్సెప్ట్ గురించి విని స్టార్ట్ చేయాలని ఆఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత అతను వివిధ కారణాలతో తప్పుకోవడంతో ఎన్టీఆర్ వద్దకు చేరినట్లు తెలుస్తుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

  సోలోగా హిట్ కొట్టాలి

  సోలోగా హిట్ కొట్టాలి

  జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తో కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ విజయంలో మరో హీరో రామ్ చరణ్ పాత్ర కూడా ఉంది అలాగే రాజమౌళి బ్రాండ్ కూడా ఆ సినిమాకు ఎంతగానో ఉపయోగపడింది. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్లో ఎన్టీఆర్ ఏదో ఒక విధంగా అయితే అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తనను తాను సోలోగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

  అలా అయితేనే సక్సెస్

  అలా అయితేనే సక్సెస్

  కొరటాల శివ ఎంత పెద్ద స్టార్ దర్శకుడు అయినప్పటికీ కూడా అతను ఇంతవరకు ఫ్యాన్ ఇండియా సినిమా చేయలేదు. కాబట్టే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పర్ఫెక్ట్ గా అంచనాలను అందుకుంటే తప్ప సక్సెస్ సాధించలేదు. ఎన్టీఆర్ కు అయితే మిగతా భాషల్లో RRR ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ ఈ సినిమా ఆ స్థాయిని అందుకుంటుందో లేదో అనేది సినిమా విడుదల వరకు చెప్పలేము.

   బిగ్గెస్ట్ స్టోరీ

  బిగ్గెస్ట్ స్టోరీ

  దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇంతకు ముందే చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇది చాలా పెద్ద కాన్వాస్ ఉన్నా కథ అని తప్పకుండా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అని చాలా ధీమాగా ఉన్నాడు. ఇంతకుముందు జనతా గ్యారేజ్ సినిమా తో ఒక బార్డర్ మాత్రమే దాటినట్లు చెప్పిన కొరటాల ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ లెవల్లో అతిపెద్ద కథను ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలియజేశాడు.

  ఇదివరకే ఒక హీరోతో..

  ఇదివరకే ఒక హీరోతో..

  ఇక ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దర్శకుడు కొరటాల శివ ఇలాంటి కథని ఒక హీరో కోసం ముందుగా ఓకే చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ హీరో కు సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేయగా ఆ తర్వాత మళ్ళీ ప్రణాళికలు మారిపోవడంతో కొరటాల శివ మార్పులు చేసి ఎన్టీఆర్ కు సెట్ చేసినట్లు సమాచారం.

  అల్లు అర్జున్ కోసం..

  అల్లు అర్జున్ కోసం..

  ఈ కథను రిజెక్ట్ చేసింది మరెవరో కాదు అల్లు అర్జున్ అని కూడా టాక్ వస్తోంది. అసలైతే ఇదివరకే కొరటాల శివ అల్లు అర్జున్ కలయికలో ఒక సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ ఒక సముద్రం ఒడ్డున నిలబడి చూస్తూ ఉన్నాడు.

  ఆ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే మోషన్ పోస్టర్ లో కూడా ఎన్టీఆర్ నడిసముద్రంలో నిలబడి ఉండడంతో కొంత మ్యాచ్ అయినట్లుగా ఊహించుకుంటున్నారు.

  మార్పులు చేసి..?

  మార్పులు చేసి..?

  దాదాపు అదే కదా అని.. ఎన్టీఆర్ కోసం మళ్లీ మార్పులు చేర్పులు చేసే కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ కథపై పూర్తి స్థాయిలో నమ్మకం గా అనిపించే వరకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చాలావరకు మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

  English summary
  Allu arjun first option for jr ntr 30 project story and koratala siva plans changes,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X