మళ్ళీ ఫారెన్ ట్రిక్ కు బన్నీ అండ్ కో.. ఈసారి ఏ దేశానికి వెళ్ళాడో తెలుసా?

పుష్ప సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతానికి ఆ సినిమా సీక్వెలైన సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. అయితే అల్లు అర్జున్ చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉంటున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఆయన టాంజానియా అనే దేశానికి విహారయాత్ర కోసం వెళ్లినట్లు ప్రచారం మొదలైంది. అల్లు అర్జున్ గతంలో ఎప్పుడూ కూడా విదేశీ విహారయాత్రలు అంటే ఆసక్తి చూపించేవారు కాదు కానీ ఇప్పుడు ఎందుకో కానీ విదేశీ విహారయాత్రలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనే తన పెళ్లి రోజు వేడుకలకు విదేశీ విహారయాత్రకు వెళ్లిన ఆయన ఇప్పుడు తన కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి టాంజానియా అనే దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా రూపొందబోతున్న పుష్పా సినిమా రెండో భాగానికి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. కొంతమంది కొత్త నటీనటులను కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దాని కోసం ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. పుష్ప మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో రెండో భాగాన్ని మరింత కట్టుదిట్టంగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.

Allu Arjun flew to Tanzania with family and friends for a holiday

ఇక ఈ సినిమాలో రష్మిక వందన పాత్ర రెండో భాగంలో చనిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ రావడంతో ఈ సినిమా నిర్మాత ఎర్నేని రవిశంకర్ దాన్ని ఖండించారు. అసలు సుకుమార్ ఇంకా కథ పూర్తి చేసి తమకు చెప్పలేదని మీరు ఇలా కొత్త కొత్త ఊహాగానాలు నమ్మితే ఏం చేయలేమని ఆయన అన్నారు. ఏవో వార్తల కోసం ఎవరో రాసుకుంటూ ఉంటారు కానీ అసలు విషయం ఏమిటంటే ఆ కధ మాకు కూడా తెలియదు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక అల్లు అర్జున్ పుష్ప తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. మిగతా హీరోలందరూ ఒకటి రెండు సినిమాలు ఇప్పటికే లైన్లో పెట్టుకుంటే అల్లు అర్జున్ తరువాత సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయం మీద మాత్రం అల్లు అర్జున్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X