అల్లు అర్జున్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు అనౌన్స్ చేసిన 'ఐకాన్' మూవీలో కూడా అల్లు అర్జున్ నటించనున్నాడు. అయితే తాజా సమాచారం మేరకు బన్నీ మరో సినిమాను కన్ఫర్మ్ చేశారని తెలిసింది. క్రేజీ డైరెక్టర్ బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
'నా పేరు సూర్య' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12న విడుదల కాగానే స్పీడ్ మరింత పెంచనున్నారట బన్నీ. ఈ సినిమా రిలీజ్ కాగానే సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు అల్లు అర్జున్. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ డిఫెరెంట్ రోల్ పోషించనున్నాడు.

మరోపీవైపు బాబీ (కే.యస్.రవీంద్ర) దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయాలని బన్నీ డిసైడ్ అయినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే వెంకటేష్, నాగచైతన్యలతో 'వెంకీ మామ' రూపంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన బాబీ.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్‌కి ఓ స్టోరీ లైన్ వినిపించాడట.
దీనికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ మేరకు అల్లు అర్జున్ తో తీయబోయే ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట బాబీ. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మించే అవకాశముందని టాక్.


Click it and Unblock the Notifications











