ఆర్య 3 వదిలేసుకున్న అల్లు అర్జున్.. కొత్త హీరోకు అవకాశం.. ఎవరికంటే?
అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప 2 ది రూల్ చిత్రం బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ చాలా బిజీ అయ్యారు. ఇక తన రాబోయే సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్య, ఆర్య 2 చిత్రాలు వచ్చి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఆర్య 3 చిత్రాన్ని తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో షాకింగ్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
సుకుమార్, అల్లు అర్జున్ ఆర్య ఫ్రాంచైజీ..
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలుత ఆర్య చిత్రం వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2004లో విడుదలై యూత్ లో క్రేజీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తర్వాత ఆర్యకు స్పిరిచ్చుయేల్ సీక్వెన్స్ గా ఆర్య 2 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఆర్య 3ని కూడా తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్య చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించడంతో ఇప్పుడు మళ్లీ ఆర్య 3కు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని తెలుస్తోంది.

అల్లు అర్జున్ వదులుకోవడంతో కొత్త హీరోకు ఛాన్స్..
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు. దీంతో ఆయన సినిమాల స్కేల్ కూడా పెరుగుతుంది. డైరెక్టర్స్, బడ్జెట్, కథ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ మారిపోయాయి. దీంతో ఆయన కెరీరియల్ లో బెస్ట్ ఫిల్మ్స్ అయిన ఆర్య, ఆర్య 2 తర్వాత రాబోయే ఆర్య 3ని కూడా అల్లు అర్జునే చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం ఆ చిత్రాన్ని అల్లు అర్జున్ వదులుకున్నాడని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిల్ రాజ్ అన్న కొడుకు ఆషిశ్ రెడ్డి వచ్చాడు. ఇప్పటికే ఆషిశ్ రెడ్డి రౌడీ బాయ్స్, లవ్ మీ అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
సుకుమార్ దర్శకత్వంలోనే..
సుకుమార్ పుష్ప 2 తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత నెక్ట్స్ పుష్ఫ 3, రామ్ చరణ్ తో సినిమా ఉందంటూ ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఆర్య 3 తెరపైకి వచ్చింది. అయితే ఆర్య 3ని సుకుమారే దర్శకత్వం వహించడం లేదు. కేవలం స్క్రీన్ రైటర్ గా, కో ప్రొడ్యూసర్ బాధ్యతలు వహిస్తున్నారు. సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉంటుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మున్ముందు ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.
అల్లు అర్జున్ ఇలా బిజీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. 600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతోంది. మృణాల్ ఠాకూర్, అనన్య పాండే, జాన్వీ కపూర్ ఇప్పటికే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు దీపికా పదుకొణెను కూడా టీమ్ సంప్రదించినట్టు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూపదిద్దుకోబోతోంది.


Click it and Unblock the Notifications











