అల్లు అర్జున్‌‌‌ని జైలుకెళ్లకుండా కాపాడి .. చిరంజీవి చక్రం తిప్పారా?

ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అని చెప్పాలి. ఓ పక్క తన సినిమా పుష్ప 2 ఆల్ ఇండియా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంటే మన తెలుగు స్టేట్స్‌లో అల్లు అర్జున్ అరెస్ట్ వార్త మాత్రం అందరికీ షాకిచ్చింది. పుష్ప 2 విడుదలకి ముందు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాద ఘటనలో తొలుత విచారణే అనుకుంటే తర్వాత అల్లు అర్జున్‌ని కూడా అరెస్ట్ చేస్తున్నారు అనే మాటే షాకింగ్‌గా మారి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టించింది.

అయితే అల్లు అర్జున్ డీసెంట్ గానే పోలీసులతో వెళ్ళిపోయాడు కానీ అక్కడి నుంచి మొదలైంది అసలు తంతు అంతా. అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ సహా మెగా కుటుంబం అంతా కూడా ఒకటై బన్నీని ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ గ్యాప్ లోనే అల్లు అర్జున్ 14 రోజులు బయటకి రాడు అంటూ మరిన్ని షాకింగ్ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

allu arjun got bail who is that lawyer is megastar chiranjeevi also behind

దీనితో అల్లు అర్జున్ విషయం మరింత టెన్షన్ పుట్టించింది. అయితే ఎట్టకేలకి అల్లు అర్జున్‌కి ఈరోజే మధ్యంతర బెయిల్ వచ్చేసింది. తాను బయటకి కూడా వచ్చేసిన వార్తలు మెగా వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అయితే అసలు ఇంత తక్కువ సమయంలోనే ఈ సీరియస్ కేసులో అల్లు అర్జున్ కి బెయిలు ఇప్పించిన హీరోపై అల్లు అర్జున్ సహా మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా అతడు మరెవరో కాదట. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, అలాగే లాయర్ కూడా అయినటువంటి నిరంజన్ రెడ్డి అట. మరి ఇతడే అల్లు అర్జున్ కి బెయిలు ఇప్పించడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడట. అల్లు అర్జున్ కేసుని కోర్ట్‌లో చాలా చాకచక్యంగా వాదించి సాయంత్రానికి బెయిలు వచ్చేలా చేశారట. ఇతని విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తాను మెగాస్టార్ చిరంజీవికి ఎంతో దగ్గర స్నేహితుడు కూడా అట.

allu arjun got bail who is that lawyer is megastar chiranjeevi also behind

ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" సినిమా చేసింది కూడా ఈయనే అనే క్రేజీ మేటర్ ఒకటి బయటకి వచ్చింది. ఇలా మెగాస్టార్ వెనకుండి చొరవ తీసుకోవడంతోనే ఇంత త్వరగా అల్లు అర్జున్ బయటకి వచ్చేలా సెట్ చేశాడని ఇపుడు సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. సో మొత్తానికి అల్లు అర్జున్ కేసులో ప్రస్తుతానికి మంచి ఉపశమనం దక్కింది అని చెప్పాలి. దీనితో అల్లు, మెగా అభిమానులు నిరంజన్ రెడ్డికి క్రెడిట్ ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ కాసేపట్లో విడుదల కానుండటంతో సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X