గెస్ట్ రోల్ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్

By Srikanya

అల్లు అర్జున్ త్వరలో గెస్ట్ గా కనిపించనున్నాడంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.అది మరేదో చిత్రం కాదు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందే చిత్రంలో అని తెలుస్తోంది.సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ ఓ ప్రత్యేకమైన పాత్రలో మెరుస్తాడని అంటున్నారు.దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఓకే చేసాడని తెలుస్తోంది.రామ్ చరణ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అని ఎప్పుడునుంచో అనుకుంటున్న కోరిక ఈ సినిమాతో తీరుతుందంటున్నారు.అయితే ఆ పాత్ర రిలీజ్ వరకూ రహస్యంగా ఉంచాలని,అప్పుడే ధియేటర్ లో పేలుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఆ చిత్రం టైటిల్ వాడే అని తెలుస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్ కూడా ఓకే చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఫిల్మ్ చాంబర్ లో ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించనున్నారు.

ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ మా బేనర్‌లో రెండు హిట్ చిత్రాలను ఇచ్చిన వంశీ పైడిపల్లి చెప్పిన కథ వినగానే నాకు బాగా నచ్చింది. రామ్‌చరణ్ కూడా ఈ కథ విని ఎక్సయిట్ అయ్యారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేసే రామ్‌చరణ్ ఈ కథపై చాలా నమ్మకం వుంచి అంగీకరించారు. ప్రస్తుతం ఈ కథ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ కథ మెగా అభిమానుల అంచనాలకు తగ్గ విధంగా ఉండటంతో పాటు మా సంస్థ నుంచి వచ్చే చిత్రాలకు తగ్గకుండా ఉంటుంది. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుంది అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ఈ సంస్థలో నాకిది మూడో సినిమా. ఇది అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ కావడం ఆనందంగా ఉంది. అందరి అంచనాలను చేరుకునే విధంగా ఈ కథని తయారు చేశాం అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X