హన్సికని వదలనంటున్న దేశముదురు అల్లు అర్జున్

By Srikanya

పూరీ జగన్నాధ్ రూపొందించిన దేశముదురు కాంబినేషన్ అల్లు అర్జున్,హన్సిక మళ్ళీ జతకట్టనున్నారు. అయితే ఈ సారి వివివినాయిక్ దర్శకత్వంలో ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. అల్లు అర్జున్‌ తో రూపొందనునున్న బద్రీనాథ్‌ కోసం ఈ పెయిర్ ని ఎన్నుకున్నారు. వినాయిక్,అల్లు అర్జున్ గతంలో 'బన్ని' చిత్రానికి పనిచేసిన విషయం తెలిసిందే. తాజా చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించనున్నారు. 'మగధీర' తరవాత ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిదే. ఇప్పటికే కథాచర్చలు పూర్తయినట్లు సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో చిత్రీకరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఒక విభిన్నమైన కథాంశంతో ఇది రూపొందబోతోంది.

మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కబోయే 'బద్రీనాథ్‌'కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడవుతాయి. ఈ చిత్రానికి చాలా కాలం తర్వాత చిన్ని కృష్ణ కథ అందివ్వటం మరో విశేషం. ఇక హన్సిక,అల్లు అర్జున్ కాంబినేషన్..క్రిష్ రూపొందిస్తున్న వేదం కు రిపీట్ కావాల్సింది. అయితే హన్సిక తన రోల్ మరీ చిన్నదని రిప్యూజ్ చేయటంతో అప్పటికి ఆగింది. అలాగే మొదట వివినాయిక్ ఈ బద్రినాధ్ చిత్రానికి ఇలియానా అనుకున్నారు. అయితే డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోవటంతో ఆమె ప్లేస్ లోకి హన్సిక వచ్చి చేరింది. అసలు అల్లు అర్జున్ స్వయంగా హన్సికను పట్టుపట్టి తీసుకున్నాడని కూడా మరో ప్రక్క వినపడుతోంది. ఇక హన్సిక, నితిన్ కాంబినేషన్ లో రెడీ అయిన సీతారాముల కళ్యాణం చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X