మెగాహీరోతో సినిమా చేస్తూ మరో మెగాహీరోని హర్ట్ చేశాడు
చెప్పుకోవడానికి కేవలం ఒకే ఒక్క హిట్టు మాత్రమే ఉన్నప్పటికీ తానేదో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ లా, స్టీవెన్ స్పీల్ బర్గ్ లా ఫీలైపోతూ ఉంటాడు డైరెక్టర్ హరీష్ శంకర్. 'మిరపకాయ్" అనే నాసిరకం సినిమాతో హిట్టు కొట్టిన ఇతగాడికి నోటీ దురద కాస్త ఎక్కువే. రామ్ గోపాల్ వర్మ కి కజిన్ బ్రదర్ లా కహానీలు వల్లించే ఇతగాడు ఎక్కువగా తనకి అక్కర్లేని మేటర్లలో వేలు పెట్టి కెలుకుతుంటాడు. ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు తమ పని తాము చూసుకోవడానికే ఇష్టపడతారు. వేరే వారి గురించి మాట్లాడాల్సి వస్తే కేవలం మంచే చెబుతుంటారు కానీ చెడు గురించి మాట్లాడరు.
అయితే ప్రస్తుం గబ్బర్ సింగ్ సినిమాకి పనిచేస్తున్న హరీష్ శంకర్ సడన్ గా ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల లిస్టి ఇచ్చాడు వాటిలో బద్రినాథ్ ని స్కిప్ కొట్టాడు. నిజానికి అతను పోస్ట్ చేసిన మేటర్ నిజమే కానీ బద్రినాథ్ హిట్టని డబ్బా కొట్టుకుంటున్న గీతా ఆర్ట్స్ బృందానికి హరీష్ శంకర్ పద్దతి నచ్చలేదు. మెగా హీరోతో సినిమా చేస్తూ మరో మెగా హీరో సినిమా ప్లాపని చెప్పడంతో హరీష్ మేటర్ బన్నీదాకా వెళ్ళింది. తనతో బయట చాలా క్లోజ్ గా ఉండే హరీష్ ఇలా తన ఫీలింగ్స్ ని పబ్లిక్ ప్లాట్ ఫారం పై హర్ట్ చేయడం పట్ల బన్నీ ఫీలవుతున్నాడట.


Click it and Unblock the Notifications











