మెగా మేనల్లుడికి అల్లు అర్జున్ సాయం.. ఆ బ్యాడ్ రూమర్లకు చెక్ పెట్టేందుకేనా.?

By Manoj

టాలెంట్ ఉన్నా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలో కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. ఈ మధ్య వరుస పరాజయాలతో నిరాశకు లోనవుతున్నాడు. మేనమాల పోలికలు, బుద్ధులు పునికి పుచ్చుకున్న ఈ మెగా మేనల్లుడికి భారీ విజయం దక్కాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. సాయి ధరమ్ కూడా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అతడికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాయం చేయడానికి ముందుకు వచ్చాడని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ విధంగా సాయం చేస్తున్నాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అది కొంత ఊరటనిచ్చింది

అది కొంత ఊరటనిచ్చింది

వరుస వైఫల్యాలతో కష్టాలను ఎదుర్కొంటున్న క్రమంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌కు ‘చిత్రలహరి' అనే సినిమాతో ఊరట లభించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. అయితే, కమర్షియల్‌గా మాత్రం ఇది అనుకున్నంత రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే'. మారతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ ఈ నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. తేజూ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇది డిసెంబర్ 20న విడుదల కానుంది.

సాయి ధరమ్ చూపిస్తున్నాడు

సాయి ధరమ్ చూపిస్తున్నాడు

‘ప్రతిరోజూ పండగే' సినిమాకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నాడు. బ్యాక్ నుండి తేజ్ కండలు చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ సినిమాలో ఫ్యామిలీ కంటెంట్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతోంది.

కీలక ప్రకటన చేసిన చిత్ర యూనిట్

కీలక ప్రకటన చేసిన చిత్ర యూనిట్

ఈ సినిమా విడుదలకు దగ్గరువుతున్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసేసింది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల నుంచి బస్సు యాత్రను నిర్వహిస్తోంది. ఇక, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ తేదీని ప్రకటించారు. ఇది ఈ నెల 15న హైదరాబాద్‌లో జరుగుతుందని ఓ పోస్టర్‌ను విడుదల చేసి మరీ వెల్లడించింది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
 మెగా మేనల్లుడికి అల్లు అర్జున్ సాయం

మెగా మేనల్లుడికి అల్లు అర్జున్ సాయం

సాయి ధరమ్ తేజ్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాయం చేయబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. 15న జరిగే ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా వస్తున్నాడట. నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ ‘ప్రతిరోజూ పండగే'ను అంతగా పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వాటికి బ్రేక్ వేసేందుకే బన్నీ వస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X