‘బన్నీ’తో సహకరించకపోతే సినిమా అవకాశాలు అంతేనట...
సినిమా రంగంలో సహకారం ఎంతో అవసరం. ముఖ్యంగా హీరోయిన్లు హీరోలకు బాగా సహకరించాలి. లేదంటే అవకాశాలు ఎగిరిపోతాయ్. ప్రస్తుతం కుర్ర హీరోల హవా నడుస్తోంది. ప్రధానంగా అల్లు అర్జున్ తనకు కంఫర్టబుల్ గా ఉండే నటిని ఎంపిక చేసుకుంటున్నట్లు భోగట్టా. బహుషా ఈ నెపంతోనే ఆర్య2 లో నటించిన శ్రద్దా దాస్ ను కూడా ఐరన్ లెగ్ అని మొన్న ఆ మద్య ప్రచారం చేశాడని, నిర్మాతలకు, దర్శకులకు ఆమెను సినిమాలలో తీసుకోవద్దని హెచ్చరించాడని సమాచాం.
'వేదం"లో కూడా దర్శకుడు ఎంపిక చేసినవారిని కాకుండా దీక్షా సేథ్ అనే అమ్మాయిని అల్లు అర్జునే సెలెక్ట్ చేశాడట. తాజాగా గీతాఆర్ట్స్ లో రూపుదిద్దుకుంటోన్న 'బద్రీనాథ్"లో ముందుగా హన్సికను అనుకున్నారట. అయితే ఆమె పారితోషకం ఎక్కువ డిమాండ్ చేయడంతో షీనాను ఎంపిక చేసినట్లు తెలిసింది.
షీనా మంచుమనోజ్ నటించిన బిందాస్‌లో నటించింది. వివి వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ చిత్రంలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెపుతోంది. హన్సిక కూడా మొదట్లో అలాగే ఫీలయ్యేది. దేశముదురులో సహకరించినంతగా తర్వాత సహకరించలేదని పారితోషికం డిమాండ్ అనే నెపంతో ఆమెను తప్పించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











