అల్లు అర్జున్ కావాలా? గంటకి రేటు ఎంతంటే..
అల్లు అర్జున్ ఇప్పుడున్న స్టార్స్ లో మంచి డిమాండ్ ఉన్న హీరో. అతని చేత ఏదన్నా ఓపినింగ్ చేయించాలన్నా, గెస్ట్ గా పిలవాలన్నా, రిబ్బన్ కట్ చేయించాలన్నా గంటకు ఏడు లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు అతను తన పోకెట్ మనీ సంపాదించుకుంటున్నాడని,సినిమాల్లో సంపాదించిన ప్రతీది తండ్రి అల్లు అరవింద్ కి లెక్క చెప్పాల్సిందేనని అంటున్నారు. ఎవరు అడిగినా కాదనకుండా వచ్చే అతన్ని చూసి మనమూ పిలుద్దామని ముందుకెళ్ళిన వారికి ఈ ఏడు లక్షల బిల్ పే చెయ్యక తప్పటం లేదు. అయితే ఈ రేటు పెట్టడానికి కారణం కొన్ని మొహమాటాలకు దూరంగా ఉండటానికే అని అతని శ్రేయాభిలాషులు వాదిస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్నారని తెలిసిన కొందరు అతన్ని ప్రతీ దానికి పిలవటం మానుకుంటారని, తద్వారా అల్లు అర్జున్ కి కొంత పర్శనల్ లైఫ్ మిగులుతుందని అంటున్నారు. లేకుంటా ఎవరో ఒకరు చేత చెప్పించుకుని అతని వద్దకు చేరుకుని ఆహ్వానిస్తున్నారని, వాళ్ళు అతని స్టార్ క్రెడిట్ ని వాడుకోదలిచినప్పుడు అతనూ వారి నుంచి డబ్బు వసూలు చేయటంలో తప్పులేదంటున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











